https://oktelugu.com/

Rajinikanth : రజనీకాంత్ తో కలిసి ఉన్న ఈ కుర్రాట్ పాన్ ఇండియా స్టార్ హీరో ఎవరో గుర్తుపట్టండి

రజనీకాంత్ ఒకప్పుడు సౌత్ లోనే కాకుండా పలు బాలీవుడ్ చిత్రాల్లో నటించారు. ఆయన నటించిన ‘బాష’ తరువాత ఆయనతో సినిమా తీసేందుకు బాలీవుడ్ డైరెక్ట్స్ ఇంట్రెస్ట్ పెట్టేవారు.

Written By:
  • NARESH
  • , Updated On : September 19, 2023 / 11:27 AM IST

    rajani hruthik roshan (1)

    Follow us on

    Rajinikanth : సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమాను చూడకుండా నిద్రపోని ఫ్యాన్స్ చాలా మందే ఉన్నారు. ఈ నేపథ్యంలో రజనీ వయసు పైబడిపోతున్నా.. ఆడియన్స్ ను అలరించేందుకు వరుసబెట్టి సినిమాలు తీస్తున్నాడు. తాజాగా ఆయన నటించిన ‘జైలర్’ సక్సెస్ అయింది. ఈ మూవీని ఆడియన్స్ ఆదరణ పొందడమే కాకుండా రూ. 700 కోట్ల వసూళ్లు చేబట్టిన మూవీగా రికార్డుల్లోకెక్కింది. అయితే రజనీ ఏమాత్రం గ్యాప్ ఇవ్వకుండా కానగరాజ్ డైరెక్షన్లో సినిమాలో నటించబోతున్నాడు. ఈ తరుణంలో రజనీకాంత్ ఓ కుర్రాడితో ఉన్న ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ కుర్రాడిని ఎంతో ఆప్యాయంగా అలుముకుంటున్నాడు రజనీ. అయితే ఆ కుర్రాడు ప్రయోగాత్మక చిత్రాలు తీసే పాన్ ఇండియా హీరో. ఆయన ఎవరో? ఈ సినిమా గురించిన వివరాల్లోకి వెళితే..

    రజనీకాంత్ ఒకప్పుడు సౌత్ లోనే కాకుండా పలు బాలీవుడ్ చిత్రాల్లో నటించారు. ఆయన నటించిన ‘బాష’ తరువాత ఆయనతో సినిమా తీసేందుకు బాలీవుడ్ డైరెక్ట్స్ ఇంట్రెస్ట్ పెట్టేవారు. ఈ క్రమంలో జె.ఓం ప్రకాశ్ అనే డైరెక్టర్ ‘భగవాన్ దాదా’ అనే సినిమాను తీశాడు. ఇందులో ఆయనతో పాటు రాకేష్ రోషన్, శ్రీదేవి కలిసి నటించారు. ఈ సినిమాలో అప్పట్లో యావరేజ్ హిట్టుగా నిలిచింది. ఇటు రజనీకాంత్ తన నటనతో ఆకట్టుకున్నాడు.

    Rajinikanth – Hrithik Roshan

    ఈ సినిమాలో రజనీకాంత్ ఓ సందర్భంలో కుర్రాడిని ఆప్యాయంగా అలుముకుంటాడు. అయితే ఆ కుర్రాడు ఎవరో కాదు స్టార్ హీరో హృతిక్ రోషన్. అంతేకాదు ఈ సినిమాకు డైరక్షన్ వహించిన జె.ఓం ప్రకాశ్.. హృతిక్ రోషన్ తాత.. ఇందులో హీరోగా నటించిన రాకేష్ రోషన్.. హృతిక్ రోషన్ నాన్న.. ఇలా మూడు తరాల వారికి సంబంధం ఉన్న ఈ సినిమాలో రజనీ నటించి ఆకట్టుకున్నాడు. ఆ తరువాత ఎన్నో సినిమాల్లో నటించి సూపర్ స్టార్ అయ్యారు.

    హృతిక్ రోష్ చైల్డ్ ఆర్టిస్టుగా ఎన్నో సినిమాల్లో నటించాడు. సినీ నేపథ్యం ఉన్న కుటుంబ కావడంతో చిన్నప్పుడే కెమెరా ముందుకు వచ్చి అలరించాడు. పెరిగి పెద్దయ్యాక కూడా ప్రయోగాత్మక చిత్రాలు చేసిన పాన్ ఇండియా లెవల్లో ఆకట్టుకుంటున్నాడు. ఆయన నటించిన క్రిష్ 3 భాగాలు సంచలన విజయాలు సాధించిన విషయం తెలిసిందే. ఇప్పుడు క్రిష్ 4 కు హృతిక్ రెడీ అవుతున్నాడు. అంతకుముందు ఆయన నటించిన ‘వార్ 2’ త్వరలో రిలీజ్ కాబోతుంది.