Upendra : విభిన్నమైన ఆలోచనలతో, ఇతర హీరోలతో పోలిస్తే చాలా భిన్నంగా కనిపించే ఉపేంద్ర కి యూత్ ఆడియన్స్ లో అటు కన్నడ సినీ పరిశ్రమలోనూ, ఇటు తెలుగు సినీ పరిశ్రమలోనూ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఆయన తీసిన సినిమాలు అలాంటివి మరి. ఇప్పటి యూత్ ఆడియన్స్ ఆలోచన విధానాలకు తగ్గట్టుగా, ఆయన రెండు దశాబ్దాల క్రితమే సినిమాలు తీసాడు. ఒక సినీ హీరో గా కంటే ఎక్కువగా, డైరెక్టర్ గా ఆయన సృష్టించిన ప్రభంజనం మాటల్లో చెప్పలేనిది. ఉపేంద్ర, రా, ఓంకార, సూపర్ వంటి చిత్రాలకు ఆయన దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలకు సంబంధించిన సన్నివేశాలను మనం యూట్యూబ్ లో ఇప్పటికీ ఖాళీ సమయం దొరికినప్పుడల్లా చూస్తూనే ఉంటాం. మన మనసులో దాగి ఉన్న బోల్డ్ ఆలోచనలను ఉపేంద్ర పైకి చెప్తూ ఈ చిత్రాల్లో కనిపించేవాడు. అవి ఒక తరం కి కాదు, ఎన్ని తరాల ఆడియన్స్ కి అయినా నచ్చుతుంది.
ఆయన తీసిన చిత్రాల్లో ముఖ్యంగా ‘ఉపేంద్ర’ చిత్రం గురించి మాట్లాడుకోవాలి. ఈ సినిమా ప్రారంభం నుండి చివరి వరకు ఆడియన్స్ కి గూస్ బంప్స్ రప్పించే విధంగా డైలాగ్స్, స్క్రీన్ ప్లే ని రాసుకున్నాడు. ‘ఐయామ్ గాడ్..గాడ్ ఈజ్ గ్రేట్’ వంటి డైలాగ్స్ ఇప్పటికీ ఫేమస్. ఉపేంద్ర చిత్రం లో ఉపేంద్ర చాలా బోల్డ్ గా ఉంటాడు. బాధ్యత తెలియని సోంబేరి ఒక చోట ఖాళీగా కూర్చున్నప్పుడు అతన్ని చూసి ‘అందరూ కష్టపడి పని చేస్తుంటే, వర్కింగ్ హావర్స్ లో నువ్విక్కడ కూర్చొని ఖాళీగా ఏమి చేస్తున్నావ్’ అని అడుగుతాడు. నాకు పని పాట ఏమి లేదు అని అతను చెప్పగానే, తన చేతిలో ఉన్న తుపాకీ ని తీసి కాల్చేసి ‘ప్రపంచ జనాభాలో ఒకడు తగ్గిపోయాడు..గాడ్ ఈజ్ గ్రేట్’ అని అంటాడు. ఇలాగే ఈ సినిమా మొత్తం ఉపేంద్ర ప్రవర్తిస్తూ ఉంటాడు.
ఒక తాగుబోతు ని చూసి అతని భార్య ఏడుస్తూ ఉంటుంది. ఆమె బాధని చూడలేక ఆ తాగుబోతుని కాల్చేస్తాడు. అప్పుడు ఆమె నా భర్త ని చంపేశావ్ కదరా, ఇప్పుడు నేను ఎవరి కోసం బ్రతకాలి అని ఏడుస్తుంటే, ఆమెని కూడా షూట్ చేసి చంపేస్తాడు. వీళ్లిద్దరి బిడ్డ ఒక మూల కూర్చొని ఏడుస్తుంటే, అతని దగ్గరకి వెళ్లి ‘రేయ్ ఏడవకు..చూడు ప్రపంచం ఎంత విశాలమైనదో..వెళ్ళు..నీకు నచ్చినట్టు బ్రతుకు పో’ అనగానే ఆ బుడ్డోడు పరిగెత్తుకుంటూ వెళ్తాడు. అప్పుడు వాడిని చూసి ‘అబ్బా ఆ స్పీడ్ చూడు..చూస్తుంటే వీడు భవిష్యత్తులో మరో సుభాష్ చంద్రబోస్ అయ్యేలా ఉన్నాడు’ అని అంటాడు. ఆ కుర్రాడు రీసెంట్ గా ఉపేంద్ర లేటెస్ట్ మూవీ ‘UI’ ప్రొమోషన్స్ లో పాల్గొంటాడు. ఉపేంద్ర తో మాట్లాడుతూ ఆ రోజు పారిపోయిన సుభాష్ చంద్రబోస్ నేనే అని అంటాడు. అతన్ని చూసి ఆశ్చర్యపోయిన ఉపేంద్ర ‘అప్పుడు పారిపోయి..ఇప్పుడు వచ్చావా’ అని అంటాడు. సోషల్ మీడియా లో ఒక రేంజ్ లో వైరల్ అయిన ఈ వీడియో ని చూసి మీరు కూడా ఎంజాయ్ చేయండి.