Homeఎంటర్టైన్మెంట్Rajamouli-Pawan Kalyan movie: రాజమౌళి-పవన్ కళ్యాణ్ మూవీ ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Rajamouli-Pawan Kalyan movie: రాజమౌళి-పవన్ కళ్యాణ్ మూవీ ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Rajamouli-Pawan Kalyan movie:  బాహుబలి మూవీ తర్వాత దర్శకధీరుడు రాజమౌళి రేంజ్ మారిపోయిందనే చెప్పాలి. అలానే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. దేశవ్యాప్తంగా ఆయనకున్న ఫాలోయింగ్ చూస్తే అర్దం అవుతుంటుంది. అయితే వీరిద్దరి కాంబోలో ఒక మూవీ చేయాలని అభిమానులు ఎప్పటి నుంచో కోరుకుంటున్నారు. పలు సంధర్భాల్లో రాజమౌళి, పవన్ కూడా వారి మనసులోని మాటలను బయట పెట్టారు. అయితే పవర్ స్టార్ తో రాజమౌళి ఒక సినిమా ప్లాన్ చేశాడు. కథ తీసుకెళ్లి వినిపించారు కూడా.. కానీ ఆ సినిమా ఎందుకు పట్టాలెక్కలేదన్నది ఎవరికీ తెలియని విషయం. దీనిపై రాజమౌళి ఇటీవల స్పందించారు.

గతంలో ఓ సారి రాజమౌళి పవన్ తో సినిమా చేసేందుకు ప్రయత్నించారట. పవన్ కళ్యాణ్‌తో ఓ సినిమాను ప్లాన్ చేసిన రాజమౌళి ఏవో కారణాల వలన ప్రాజెక్ట్ ముందుకు పోలేదని అన్నారు.  కొన్ని సంవత్సరాల కింద పవన్ కళ్యాణ్‌తో ‘సై’ సినిమా తీయాలని ఆ కథను వినిపించారట రాజమౌళి. అయితే ఓ సంవత్సరం వరకు కూడా పవన్ నుంచి ఎటువంటి కాల్ రాకపోవడంతో నిరాశ చెందానని రాజమౌళి వాపోయారు.

Videos of Rajamouli giving water bottle to Pawan Kalyan and fan touching  PK's feet go viral - IBTimes India

ఆ తర్వాత తన ఆలోచన సరళిలో మార్పు రావడం కారణంగా వేరే సినిమాలు చేశానని తెలిపారు. అలానే నేను ఎక్కువ రోజులు సినిమాలను తీస్తానని… మరోవైపు పవన్ కూడా సినిమాల కంటే రాజకీయాల్లో ఎక్కువ మక్కువ చూపడంతో వీరి కాంబినేషన్ లో సినిమా చేయలేకపోయామని రాజమౌళి తెలిపారు.

 

ఆ తర్వాత ఇదే కథను నితిన్ హీరోగా రాజమౌళి ‘సై’ పేరుతో తీశారు. అప్పట్లో రగ్మీ క్రీడా నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించినా.. రాజమౌళి కెరీర్ లో తక్కువ కలెక్షన్లు సాధించిన చిత్రంగా నిలిచింది. ఈ కథకు పవన్ ఓకే చెప్పకపోవడంతోనే వీరి కాంబినేషన్ సెట్ కాలేదని తెలుస్తోంది.

ఇక ఆ తర్వాత రాజమౌళి పంథా మారింది. కమర్షియల్ కథలకు మంగళం పాడి మగధీర, బాహుబలి, ఈగ , ఆర్ఆర్ఆర్ లాంటి డిఫెరెంట్ సినిమాలు తీస్తూ పోయాడు. ఇక పవన్ కళ్యాణ్ రాజకీయాల వైపు మరలాడు. దీంతో వీరిద్దరి కాంబినేషన్ ఇప్పటికీ సెట్ కాలేదు. భవిష్యత్తులో అవుతుందో లేదో చూడాలి.

SS Rajamouli Shocking Comments On Pawan Kalyan | Its AndhraTv

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

1 COMMENT

Comments are closed.

Exit mobile version