Sudigali Sudheer: జబర్దస్త్ ద్వారా ఎంతో మంది పేరు సంపాదించారు. ఇందులో ప్రధానంగా చెప్పాల్సిన పేరు కమెడియన్ సుధీర్. కమెడియన్ గా లైఫ్ లో మంచి నేమ్, ఫేమ్ సంపాదించిన సుదీర్ ప్రస్తుతం హీరోగా తన కెరీర్ ను కంటిన్యూ చేస్తున్నారు. వెండితెరపై తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించారు. ఇప్పటి వరకు ఎన్నో సినిమాలతో సందడి చేసిన ఈ హీరో యూత్ కు ఇన్సిపిరేషన్ గా నిలిచారు. చిన్న హీరోగా ఎంట్రీ ఇచ్చిన మంచి పేరే సంపాదించారు. అంతేకాదు ఈయన సినిమాలకు మంచి పేరు రావడంతో చాలా ఆఫర్లు వస్తున్నాయి. అయితే రీసెంట్ గానే కాలింగ్ సహస్ర అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు సుధీర్.
ఈ సినిమా ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఇప్పటి వరకు సుధీర్ నటించిన సినిమాల్లో రొమాన్స్ చాలా తక్కువ. రొమాంటిక్ సీన్లు, లిప్ లాక్ లు లేకుండా చూసుకుంటారు. ఇలా రొమాంటిక్ సన్నివేశాలు లేకుండానే హీరోయిన్లతో నటిస్తుంటారు. అయితే సుధీర్ ఎందుకు ఇలాంటి సీన్లకు దూరంగా ఉంటారని ఆరా తీస్తున్నారు నెటిజన్లు. అయితే ఒక సినిమాను ఒకే చేసేకంటే ముందే డైరెక్టర్లతో రొమాంటిక్ సీన్లకు నో చెప్తారట. కాస్త ఫేమ్ వస్తే ఎవరైనా హద్దులు దాటి ప్రవర్తిస్తారు. కానీ ఇలాంటి విషయంలో హీరో అయినా కూడా పద్దతిగా వెళ్తున్నారు సుధీర్.
సుధీర్ నేడు ఈ రేంజ్ లో ఉండడానికి కారణం జబర్దస్త్ అని చెప్పడంలో సందేహం లేదు. అయితే ఈ కార్యక్రమం ద్వారా చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు ఆదరించారని చెబుతుంటారు సుధీర్. అందుకే నేను సినిమా చేస్తున్నానంటే చిన్న పిల్లల నుంచి పెద్ద వారి వరకు అందరూ చూస్తారని. అలా అందరూ చూసేటప్పుడు వారికి ఇబ్బంది కలిగించే సన్నివేశాలలో నటించకూడదు అని నిర్ణయించుకున్నాను అని తెలిపారు సుదీర్. అంతేకాదు అమ్మాయిలకు గౌరవం ఇచ్చే ఈ హీరో వారితో ఇలాంటి సీన్లు చేయకూడదని కూడా నిర్ణయించుకున్నారట.