Kamal Haasan: తమిళ్ సినిమా ఇండస్ట్రీలో కమలహాసన్ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నాడు. ఈయన చేసిన చాలా సినిమాలు సూపర్ డూపర్ హిట్ సాధించడమే కాకుండా ఒక మంచి టేస్ట్ ఉన్న హీరోగా కూడా గుర్తింపు పొందాడు. ఇక అందులో భాగంగానే ఆయన చేసిన సినిమాలు తెలుగులో కూడా డబ్ అయి ఇక ఇక్కడ కూడా మంచి విజయాన్ని అందుకున్నాయి. ఇక ఇలాంటి క్రమంలోనే ఆయన ఎక్కువగా ఆర్ట్ సినిమాలు మాత్రమే చేస్తూ వచ్చాడు.
అయితే స్టార్ హీరోలందరూ మాస్ సినిమాలు, కమర్షియల్ సినిమాలను ఎక్కువగా చేస్తుంటే కమలహాసన్ మాత్రం ఆర్ట్ సినిమాలు చేయడానికి గల కారణం ఏంటి అనే డౌట్ అందరికీ రావచ్చు. అయితే అందరూ హీరోలకంటే ఆయన స్పెషల్ గా ఉండాలనే ఒకే ఒక ఉద్దేశ్యంతో ఆర్ట్ సినిమాలు చేస్తూ వచ్చారట. అయితే మిగతా సినిమాలతో పోలిస్తే ఆర్ట్ సినిమాలకి క్రేజ్ కొంచెం తక్కువగా ఉన్నప్పటికీ, ఆయన మాత్రం ఎప్పుడు ఆర్ట్ సినిమాలు, ప్రయోగాత్మకమైన సినిమాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ వచ్చాడు. ఇక మొత్తానికైతే కమలహాసన్ తెలుగు ,తమిళ ప్రేక్షకుల్ని తన సినిమాలతో చాలా బాగా ఎంటర్ టైన్ చేశారు అనే చెప్పాలి.
ఇక ఇప్పటికి కూడా ఆయన సినిమాలు చేస్తూ మంచి జోష్ మీద ఉన్నాడు. గత రెండు సంవత్సరాల క్రితం వచ్చిన విక్రమ్ సినిమాతో భారీ వసూళ్లను సాధించడమే కాకుండా బ్లాక్ బాస్టర్ హిట్ ను కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక మొత్తానికైతే కమలహాసన్ ఈ జనరేషన్ హీరోలకి కూడా పోటీని ఇచ్చేలా సినిమాలు చేస్తూ మెప్పిస్తున్నాడు. ఇక ఇప్పుడు ప్రభాస్ హీరోగా వస్తున్న కల్కి సినిమాలో హీరో గా నటిస్తూ తన విలనిజాన్ని కూడా పండించడానికి సిద్ధమవుతున్నాడు. చూడాలి మరి కమలహాసన్ ని విలన్ గా ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారు అనేది…
ఇక విలన్ గా కమలహాసన్ మెప్పిస్తే ఆయనకి ఇంకా మంచి అవకాశాలు వచ్చే ఛాన్సులు కూడా ఉన్నాయి…ఇక ప్రస్తుతానికి ప్రభాస్ అభిమానులు కూడా ఈ సినిమా కోసం చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు…