Chiranjeevi- Nagarjuna: బిగ్ బాస్ సీజన్ 6 గ్రాండ్ ఫినాలే నిన్న అట్టహాసం గా జరిగిన సంగతి అందరికీ తెలిసిందే..ఈ సీజన్ టైటిల్ విన్నర్ గా రేవంత్ నిలిచాడు..కానీ ఓట్ల పరంగా శ్రీహాన్ రేవంత్ కంటే ఎక్కువ సాధించాడు..క్యాష్ ప్రైజ్ కూడా 40 లక్షల వరకు గెలుచుకున్నాడు శ్రీహాన్..ఇక ఈ షో జరుగుతున్నంత సేపు ప్రముఖ సెలబ్రిటీస్ అందరూ తళుక్కుమని మెరిశారు.

నిఖిల్ , రవితేజ – శ్రీలీల మరియు సీనియర్ హీరోయిన్ రాధ వంటి వారు హాజరయ్యారు..అంతే కాకుండా ‘బాస్ పార్టీ’ సాంగ్ తో కుర్రకారులను పిచ్చెక్కించిన ఊర్వశి రౌతులా స్పెషల్ డ్యాన్స్ పెర్ఫార్మన్స్ ఫినాలే కి హైలైట్స్ లో ఒకటిగా నిలిచింది..అయితే ప్రేక్షకుల్లో ఒక చిన్న అసంతృప్తి ఏర్పడింది..కారణం బిగ్ బాస్ ట్రోఫీ ని టాలీవుడ్ టాప్ స్టార్ హీరోలలో ఒకరితో ఇప్పిస్తారని అందరు అనుకున్నారు..కానీ అది జరగలేదు..మామూలుగానే సాగిపోయింది..అదొక్కట్టే చూసే ప్రేక్షకులకు కాస్త నిరాశ కలిగించింది..కానీ బిగ్ బాస్ యాజమాన్యం మెగాస్టార్ చిరంజీవి ని గ్రాండ్ ఫినాలే కి పిలిచారట.
స్వయంగా అక్కినేని నాగార్జున చిరంజీవి కి కాల్ చేసి రిక్వెస్ట్ చేసాడట..కానీ చిరంజీవి ప్రస్తుతం ‘వాల్తేరు వీరయ్య’ సినిమాకి సంబంధించిన సాంగ్ షూట్ కోసం విదేశాల్లో ఉండడం తో రాలేకపోయాడట..’మీ అందరితో కాస్త సమయం గడపాలని నాకు కూడా చాలా కుతూహలంగా ఉంది నాగ్..కానీ సాంగ్ షూటింగ్ లో ఉన్నాను..రాలేకపోతున్నాను..దయచేసి ఏమి అనుకోవద్దు’ అంటూ చిరంజీవి నాగార్జున కి క్షమాపణలు చెప్పాడట..ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.

మెగాస్టార్ చిరంజీవి సీజన్ 3 మరియు సీజన్ 4 గ్రాండ్ ఫినాలే కి ముఖ్య అతిధిగా హాజరయ్యాడు..ఆ రెండు సీజన్ల ఫినాలే షోస్ కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది..కంటెస్టెంట్స్ తో చిరంజీవి అంత సరదాగా మాట్లాడడం చూసి అభిమానులు ఎంతో మురిసిపోయారు..మెగాస్టార్ లో ఇంత ఫన్ యాంగిల్ ఉందా అని ఆశ్చర్యపోయారు కూడా..ఈ ఫినాలే ఎపిసోడ్ కి కూడా ఆయన వచ్చి ఉంటే చాలా బాగుండేది అని అభిమానులు అనుకుంటున్నారు.