Pawan Kalyan: ప్రస్తుతం నార్త్, సౌత్ అని తేడా లేకుండా ఇండస్ట్రీ మొత్తం ఒకటే అయిపోయింది. అందుకే నార్త్ డైరెక్టర్లు సౌత్ హీరోలతో, సౌత్ డైరెక్టర్లు నార్త్ హీరోలతో సినిమాలు చేస్తూ మంచి గుర్తింపును సంపాదించుకుంటున్నారు. ఇక ఈ క్రమంలోనే తమిళంలో స్టార్ డైరెక్టర్ గా గుర్తింపు పొందిన అట్లీ ప్రస్తుతం పవన్ కళ్యాణ్ తో ఒక సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు.అట్లీ పవన్ కళ్యాణ్ తో ఎలాంటి సినిమా చేయబోతున్నాడు అనేది కూడా ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
ఇక ఇంతకు ముందు విజయ్ హీరో గా అట్లీ డైరెక్షన్ లో వచ్చిన తేరి సినిమాని తెలుగులో రీమేక్ చేయాలని పవన్ కళ్యాణ్ ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక ఈ సినిమాని మొదట హరీష్ శంకర్ తో చేయాలని ప్లాన్ చేసినప్పటికీ హరీష్ శంకర్ మాత్రం తను ఫ్రెష్ కథతో సినిమా చేస్తానని చెప్పాడు. ఇక అందులో భాగంగానే తన దగ్గర ఉన్న కథను పవన్ కళ్యాణ్ కి చెప్పి ఒప్పించి ఉస్తాద్ భగత్ సింగ్ అనే సినిమా చేస్తున్నాడు. ఇక ఎప్పటి నుంచో తేరి సినిమా మీద మనసు పడ్డ పవన్ కళ్యాణ్ ఆ సినిమాని ఎలాగైనా రీమేక్ చేయాలని చాలా సంవత్సరాల నుంచి ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు.
అందుకే ఒరిజినల్ సినిమాని తీసిన అట్లీతోనే ఈ సినిమా చేయాలని పవన్ కళ్యాణ్ భావిస్తున్నట్టుగా తెలుస్తుంది… అయితే ఈ సినిమాని అట్లీ తెరకెక్కించడం వల్ల సురేందర్ రెడ్డికి నష్టం జరుగుతుంది అంటూ కొందరు అభిప్రాయ పడుతున్నారు. ఎందుకంటే సురేందర్ రెడ్డి పవన్ కళ్యాణ్ తో ఒక సినిమా చేయడానికి కమిట్ అయ్యాడు. ఇక ఇలాంటి క్రమంలో తేరి సినిమాని సురేందర్ రెడ్డి తో రీమేక్ చేయిస్తే బాగుండేది. ఆయన కూడా తన స్టైలిష్ మేకింగ్ తో సినిమాని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్ళేవాడని చాలా మంది అభిప్రాయపడుతున్నారు.
ఇక ఏజెంట్ సినిమాతో ఢీలా పడిపోయిన సురేందర్ రెడ్డికి ఇప్పుడు స్టార్ హీరోలు ఎవరు అవకాశం ఇచ్చే ఛాన్స్ అయితే లేదు. ఇక ఈ రీమేక్ లో సురేందర్ రెడ్డికి అవకాశం ఇస్తే తనని తను ప్రూవ్ చేసుకునేవాడు. ఇక ఇప్పటికే ఆయన ధృవ సినిమాని చాలా స్టైలిష్ గా తెరకెక్కించాడు. ఈ సినిమా కూడా తమిళ్ సినిమా అయిన ‘తని ఒరవన్’ సినిమాకి రీమేక్ గా తెరకెక్కింది. ఇక ఈయన రీమేక్ సినిమాలను చాలా బాగా హ్యాండిల్ చేస్తాడు అనే పేరు కూడా ఉంది కాబట్టి తేరి సినిమా రీమేక్ కూడా ఈయనకే ఇస్తే బాగుండేది అంటూ సినీ మేధావులు సైతం సోషల్ మీడియాలో వాళ్ళ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు…