NTR: ఏ రంగంలో అయినా శిక్షణ అవసరం. సినిమా రంగంలో కూడా గొప్పగా నటించాలంటే శిక్షణ తప్పక తీసుకోవాలి. కొంతమంది నటనలో జీవిస్తుంటారు. అయినా సరే వారు శిక్షణ తీసుకుంటారు. అందులోని మెలుకువలు తెలుసుకుంటారు. అయితే ప్రస్తుత ఇండస్ట్రీలో కూడా ఎంతో మంది శిక్షణ తీసుకొని సెట్ అయిన వారే. ఇక 20 సంవత్సరాల వయసులో స్టార్ స్టేటస్ ను సొంతం చేసుకొని ఇండస్ట్రీలో నిలబడడం అంటే మామూలు విషయం కాదు. అలా తొందరలోనే స్టార్ స్టేటస్ ను సొంతం చేసుకున్న వారిలో జూ. ఎన్టీఆర్ ఒకరు. అంతే కాదు తారక్ గ్లోబల్ స్టార్ గా అవతారమెత్తారు. ఇదిలా ఉంటే అసలు తారక్ ఎక్కడ శిక్షణ తీసుకున్నాడో తెలుసా?
యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటన చూస్తే ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే. ఈయన నటిస్తాడు అంటే అది తప్పే.. జీవిస్తాడు అని చెప్పాలి. ఒక పాత్ర చేయడం కామన్ కానీ.. ఒక సినిమాలో ఎన్ని వేరియేషన్స్ అయినా చూపించగల సత్తా ఉన్న స్టార్ మాత్రం ఎన్టీఆర్ అని చెప్పడంలో సందేహం లేదు. జై లవకుశలో మూడు విభిన్న పాత్రలు పోషించి తాతకు తగ్గ మనవడు అనిపించుకున్నాడు. అయితే ఈ స్టార్ హీరో గురించి భిక్షు కొన్ని విషయాలు వెల్లడించారు. ఈయన దగ్గరే ఎన్టీఆర్ శిక్షణ పొందారట.
తన దగ్గర శిక్షణ తీసుకున్న వారు ఎదగాలని కోరుకుంటానని.. వర్క్ విషయంలో తన భార్య, కూతురు కూడా సహాయం చేస్తారని తెలిపారు భిక్షు. ఇక శిక్షణ ఇవ్వాలంటే 20 లక్షలు 30 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేయనని తెలిపారు. మంచి శిక్షణ ఇవ్వడం వల్లే కొందరు మంచి యాక్టర్లు అయితే మరికొందరు ఏకంగా ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ లు పెట్టుకున్నారని తెలిపారు భిక్షు. అయితే ఇద్దరు ముగ్గురు స్టూడెంట్స్ కు మాత్రమే శిక్షణ ఇస్తానని.. అంతకంటే ఎక్కువ మందికి ఒకేసారి శిక్షణ ఇవ్వను అని తెలిపారు. దాని వల్ల శిక్షణకు న్యాయం చేయలేం అని పేర్కొన్నారు భిక్షు.
బాల రామాయణం సినిమా కోసం పదేళ్ల వయసులోనే ఎన్టీఆర్ శిక్షణ పొందారట. అంతేకాదు తారక్ అల్లరి చేసేవాడని.. హారర్ కథలు చెప్పి భయపెట్టేవాడని సరదాగా చెప్పారు భిక్షు. అయితే ఎన్టీఆర్ నటించిన జనతా గ్యారేజ్ ఏ రేంజ్ లో హిట్ అయిందో చెప్పాల్సిన అవసరం లేదు. ఇందులో చిన్న పాత్రను పోషించారట భిక్షు. ఇలా ఎన్టీఆర్ గురించి గురువు చెప్పడంతో ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.