https://oktelugu.com/

Star Heroine : కృష్ణుడి గెటప్ లో ఉన్న ఈ స్టార్ హీరోయిన్  ఎవరో తెలుసా?

Star Heroine : అబాల గోపాలాన్ని అలరించే కృష్ణుడు భారతదేశాన తిరిగాడని చరిత్ర చెబుతోంది. కానీ ఆయన ఎలా ఉంటాడో ఎవరికీ తెలియదు. కొందరు ఆనవాళ్ల ఆధారంగా ఆర్ట్ వేసి.. ఆ తరువాత సినిమాల్లో గెటప్స్ వేశారు. తెలుగు చిత్ర సీమలో స్వర్గీయ ఎన్టీఆర్ కృష్ణుడి వేషం వేసిన తరువాతే మహదేవుడు అలాగే ఉంటాడని అందరూ అర్థం చేసుకున్నారు. అప్పటి నుంచి ప్రతీ గోకులాష్టమి నాడు ఇళ్లల్లో తమ పిల్లలకు కృష్ణుడి వేషం వేసి వాళ్లలో మాధవుడిని […]

Written By:
  • Srinivas
  • , Updated On : April 16, 2023 / 04:36 PM IST
    Follow us on

    Star Heroine : అబాల గోపాలాన్ని అలరించే కృష్ణుడు భారతదేశాన తిరిగాడని చరిత్ర చెబుతోంది. కానీ ఆయన ఎలా ఉంటాడో ఎవరికీ తెలియదు. కొందరు ఆనవాళ్ల ఆధారంగా ఆర్ట్ వేసి.. ఆ తరువాత సినిమాల్లో గెటప్స్ వేశారు. తెలుగు చిత్ర సీమలో స్వర్గీయ ఎన్టీఆర్ కృష్ణుడి వేషం వేసిన తరువాతే మహదేవుడు అలాగే ఉంటాడని అందరూ అర్థం చేసుకున్నారు. అప్పటి నుంచి ప్రతీ గోకులాష్టమి నాడు ఇళ్లల్లో తమ పిల్లలకు కృష్ణుడి వేషం వేసి వాళ్లలో మాధవుడిని చూసుకుంటున్నారు. ఇదే గెటప్ ను అలనాటి స్టార్ హీరోయిన్ చిన్నప్పుడు వేసి అలరించిందింట. ఆ ఫొటో ను లేటేస్టుగా నెట్లో పెట్టడంతో అది వైరల్ గా మారింది. తెలుగు, తమిళ చిత్రాల్లో స్టార్ హీరోల పక్కన నటించిన ఈమె ఎవరో తెలుసా?

    1980లో హీరోయిన్లు చాలా తక్కువగా ఉండేవారు. దీంతో వారి మధ్య తీవ్ర పోటీ ఉండేది. అయినా ఆ కాలంలోని భామలు తొందర్లోనే స్టార్ హీరోల పక్కన నటించే ఛాన్స్ కొట్టేసేవారు. ఒకటి, రెండు సినిమాలతోనే స్టార్ హీరోయిన్లు అయ్యేవారు. అలా కొన్ని సినిమాలతోనే స్టార్ ఇమేజ్ తెచ్చుకున్నవారిలో రాధ ఒకరు. భారతీరాజా తెరకెక్కించిన ‘అలైగల్ ఓవతిల్లై’ సినిమాతో సినీ ఎంట్రీ ఇచ్చిన రాధ ఆ తరువాత తెలుగులో ఎంట్రీ ఇచ్చింది. గోపాల కృష్ణుడు, అత్తకు తగ్గ అల్లుడు, నాగు, ఆయుధం, అడవి దొంగ లాంటి పలు చిత్రాల్లో మెరిసింది.

    అయితే సినీ కెరీర్ మంచి పొజిషన్లో ఉన్న సమయంలోనే తన బంధువు మణి అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది రాధ. ఆ తరువాత సినిమాల నుంచి మెల్లగా తప్పుకుంది. అయితే మళ్లీ కొన్ని సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా అవకాశం వచ్చినా రాధ సినిమాల్లోకి రాలేదు. ముంబైలో బిజినెస్ కే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చేవారు. అయితే ఆమె కూతరు కార్తీక ను సినీ ఇండస్ట్రీలోకి తీసుకొచ్చారు. నాగ చైతన్య నటంచిన ‘జోష్ ’ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఆమె ‘రంగం’ సినిమాతో ఫేమస్ అయింది.

    రాధ చిన్నప్పుడు అల్లరి పనులు ఎక్కువగా చేసేదట. ఈ సమయంలోనే తనకు శ్రీకృష్ణుడి గెటప్ వేయాలని ఇంట్లో వాళ్లను ఫోర్స్ చేసేదట. ఆమె ఇష్టాన్ని కాదనలేక ఇంట్లోవారు ఆమెకు మాధవుడి గెటప్ వేసి మురిసిపోయారట. ఆ సమయంలో తీసుకున్న పిక్ ను రాధ ఇటీవల సోషల్ మీడియాలోని తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసింది. కేరళ లో విషు పండుగ సందర్భంగా దీనిని బయటపెట్టడంతో ఇప్పుడీ పిక్ వైరల్ అవుతోంది.