https://oktelugu.com/

Viral Photo : ఈ ఫోటోలో చిరంజీవితో ఉన్న ఆ ఆమ్మాయి ఇప్పుడొక స్టార్ హీరోయిన్ గుర్తుపట్టారా..?

ఈ ఫోటోలో చిరంజీవి పక్కన నిల్చుని ఉన్న అమ్మాయి కూడా చైల్డ్ ఆర్టిస్ట్ గా చాలా సినిమాలు చేసింది.

Written By:
  • NARESH
  • , Updated On : December 12, 2023 / 09:35 PM IST
    Follow us on

    Viral Photo : సాధారణంగా చైల్డ్ ఆర్టిస్ట్ గా ఉన్న చాలా మంది హీరోలు గాను, హీరోయిన్లుగాను మారిపోయి ఇండస్ట్రీలో తమదైన రీతిలో రాణిస్తూ ముందుకు వెళ్తున్నారు. ముఖ్యంగా చైల్డ్ ఆర్టిస్ట్ గా వచ్చి మంచి గుర్తింపు పొందిన వారిలో తేజ సజ్జ ఒకడు. ప్రస్తుతం హీరోగా అవకాశాలను అందుకుంటూ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ ను ఏర్పాటు చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాడు.ఇక ఇలాంటి క్రమంలోనే మరి కొంతమంది చైల్డ్ ఆర్టిస్టులు కూడా సినిమాల్లో రాణించడానికి సిద్దమవుతున్నారు. ఇక ఇది ఇలా ఉంటే ఈ ఫోటోలో చిరంజీవి పక్కన నిల్చుని ఉన్న అమ్మాయి కూడా చైల్డ్ ఆర్టిస్ట్ గా చాలా సినిమాలు చేసింది.

    ఈ ఫోటోలో ఉన్న అమ్మాయిని ఇప్పటికే మీరు గుర్తుపట్టి ఉంటారు. ఈమె ఎవరు అంటే దేవుళ్ళు సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన నిత్య శెట్టి.. ఈమె దేవుళ్ళు సినిమాలో వాళ్ల పేరెంట్స్ కలవడానికి దేవుళ్ళ గుడిలన్నీ తిరుగుతూ ఉంటుంది. ఆ సినిమాలో తను అద్భుతమైన నటనను కనబరిచింది. ఇక అందులో భాగంగానే ది బెస్ట్ నటిగా కూడా గుర్తింపు పొందింది. ఇక తర్వాత చిరంజీవి హీరోగా కోడి రామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన అంజి సినిమాలో చిరంజీవితో పాటు ఉండే పిల్లల గ్రూప్ లో తను కూడా ఒకటీగా ఉంటుంది.

    ఇక ఈ సినిమాలో చేసిన తర్వాత చైల్డ్ ఆర్టిస్ట్ గా తనకి మంచి గుర్తింపు అయితే లభించింది.ఈ సినిమా ఇచ్చిన ఉత్సాహంతో మరికొన్ని సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించింది. ఇక ఆ తర్వాత ఆమె చదువు నిమిత్తం సినిమాలకు బ్రేక్ ఇచ్చి స్టడీలో బిజీ అయిపోయింది.ఇక ఇప్పుడు హీరోయిన్ గా మరి పిట్ట కథ అనే ఒక సినిమాలో కూడా నటించింది. అయినప్పటికీ ఆ సినిమా పెద్దగా సక్సెస్ కాకపోవడంతో నటిగా ఆమెకు పెద్ద గుర్తింపు అయితే రాలేదు. ఇక ఇప్పుడు అవకాశం వస్తే సత్తా చాటడానికి తను సిద్ధమవుతుంది. ఇక అందులో భాగంగానే ఇప్పుడు తన చిన్నప్పటి ఫోటో మీడియాలో వైరల్ అవుతుంది.

    ఎప్పటికప్పుడు తన ఫోటోలను సోషల్ మీడియా లో పెడుతూ తన ఫ్యాన్స్ ని అలరిస్తూ ఉంటుంది. అలాగే తన వీడియోలను కూడా పోస్ట్ చేస్తూ ఉంటుంది. ఇలా ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన అప్డేట్లని తన ఫ్యాన్స్ తో పంచుకోవడంలో నిత్య శెట్టి ముందు వరుసలో ఉంది. ఇక మొత్తానికి నిత్య శెట్టి కి మరో అవకాశం వస్తే మాత్రం హీరోయిన్ గా తన సత్తా చాటడానికి సిద్ధమవుతుంది…