
Who is this Director: నలుగురు కుర్రాళ్లు ఓ స్ట్రీట్ కార్నర్ లో మాట్లాడుకుంటున్నారు. ఇలాంటి వారు కలిస్తే ఏం మాట్లాడుతారు? అసవరమైతే కళాశాల ముచ్చట్లు.. లేదా సరదా కబుర్లు.. కానీ ఇలా కుర్రాళ్లు మాట్లాడుకుంటున్న ఓ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందులో అందరికంటే చిన్నగా ఉండి బైక్ పై కూర్చున్న వ్యక్తికి సర్కిల్ వేసి మరీ నెట్టింట హల్ చల్ చేస్తున్నారు. ఈ వ్యక్తి ఎవరో తెలుసా? అని పోస్టులు పెడుతున్నారు. ఎవరబ్బా? అని చూసేందుకు తెగ ట్రై చేస్తున్నారు. ఆ తరువాత తెలిసింది. అయన మాములు వ్యక్తి కాదని.. ప్రపంచ గుర్తింపు పొందిన తెలుగు డైరెక్టర్ రాజమౌళి అని.
ఇటీవల దర్శక ధీరుడు రాజమౌళి పేరు మీడియాలో మారుమోగుతోంది. ఆయన తీసిన ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు సాంగ్ కు ఆస్కార్ అవార్డు దక్కడంతో ప్రపంచం నలుమూలల నుంచి జక్కన్నను కీర్తిస్తున్నారు. ఆస్కార్ అంచుల వరకు వెళ్లడమే గగనమనుకుంటున్న తరుణంలో ఏకంగా అవార్డును కొట్టుకొచ్చిన రాజమౌళిపై పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. ఈ తరుణంలో రాజమౌళి పర్సనల్ విషయాలపై తీవ్ర చర్చ సాగుతోంది. ఈ క్రమంలో ఆయన చిన్న నాటి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇందులో భాగంగానే ఆ ఫొటో హాట్ టాపిక్ గా మారింది.
ఈ ఫొటోలో ఉన్న నలుగురి వ్యక్తుల్లో సర్కిల్ ఉన్నాయనే రాజమౌళి. తన స్నేహితులతో ఓ సందర్భంలో మాట్లాడుతున్నప్పుడు తీసుకున్న ఫొటో. రాజమౌళి పూర్వీకులది పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు గ్రామం. కానీ ఆయన తండ్రి విజయేంద్రప్రసాద్ కర్ణాటకకు మారారు. ఈ క్రమంలో విజయేంద్రప్రసాద్ దంపతులకు 1973లో కర్నాటక రాష్ట్రం రాయచూర్ జిల్లా అమరేశ్వరి క్యాంప్ లో రాజమౌళి జన్మించారు. అయితే రాజమౌళి విద్యాభ్యాసం మాత్రం ఏపీలోని ఏలూరు, విశాఖపట్నంలోనే సాగింది. రాజమౌళి చదువుతున్నంతకాలం స్నేహితులతో సరదాగా ఉండేవారు. వారితో షికార్లు కొడుతూ ఎంజాయ్ చేసేశారు.
చదువు పూర్తయిన తరువాత జక్కన్న కెరీర్ పై ఎక్కువగా దృష్టి పెట్టారు. తండ్రి విజయేంద్రప్రసాద్ రచయిత అయినందువల్ల ఆయన కూడా సినిమాల్లో రాణించాలని అనుకున్నారు. అయితే కీరవాణి తండ్రి శివశక్తి దత్త రాజమౌళిని హీరోగా నటించాలని కోరారు. కానీ ఆయనకు హీరో అవడం ఇష్టం లేదని చిరునవ్వుతో తిరస్కరించేవారు. ఆ తరువాత దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు దగ్గర శిక్షణ తీసుకొని 2001లో స్టూడెంట్ నెంబర్ సినిమాతో డైరెక్టర్ గా ఎంట్రీ ఇచ్చారు. ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందారు.