Pushpa 2 : తెలుగు సినిమా ఇండస్ట్రీలో పుష్ప 2 సినిమాకి అరుదైన గౌరవమైతే దక్కుతుంది. ఈ సినిమా ఇండియా వైడ్ గా భారీ వసూళ్లను రాబడుతూ ముందుకు దూసుకెళ్తున్న విషయం మనకు తెలిసిందే. ఇక బాహుబలి 2 సినిమా రికార్డును బ్రేక్ చేయడానికి ఒక్క అడుగు దూరంలో ఉన్న పుష్ప 2 సినిమా తొందర్లోనే రికార్డును బ్రేక్ చేసి తమ సత్తా చాటుకునే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికి అల్లు అర్జున్ లాంటి స్టార్ హీరో సైతం తన దైన రీతిలో సత్తా చాటుకోవడమే కాకుండా ఆయనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును కూడా తెచ్చుకున్నాడు. ఇక పాన్ ఇండియాలో ఆయనను మించిన నటులు మరొకరు లేరు అనేంతలా గుర్తింపుని సంపాదించుకున్న ఈ స్టార్ హీరో ఇప్పుడు కూడా తనదైన రీతిలో సత్తా చాటడమే లక్ష్యం గా పెట్టుకొని ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తోంది. మరి ఏది ఏమైనా కూడా అల్లు అర్జున్ లాంటి స్టార్ హీరో ఇప్పుడు చేస్తున్న ప్రతి సినిమా భారీ విజయాన్ని అందుకోవడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్నాడు.
ఇక ఇదిలా ఉంటే పుష్ప 2 సినిమాలో శ్రీ లీల తో కలిసి అల్లు అర్జున్ చేసిన ‘కిసక్ ‘ అనే సాంగ్ ఎంత పెద్ద సక్సెస్ ని సాధించిందో మన ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇక ఇందులో అల్లు అర్జున్ శ్రీలీల కెమిస్ట్రీ చాలా అద్భుతంగా వర్కౌట్ అయింది. ఇక ఇదిలా ఉంటే కిసక్ సాంగ్ మేకింగ్ కి సంభందించిన ఫోటోలు ఇప్పుడు రిలీజ్ చేశారు.
అయితే ఈ సాంగ్ లో ఒక అమ్మడు ఆడి పాడింది. మరి ఇంతకీ ఆమె ఎవరు హీరోయిన్ ని మించిన అందంతో చాలా అద్భుతంగా ఉండటమే కాకుండా ప్రేక్షకులందరిని ఆకట్టుకుంటున్న ఈ అమ్మడు పేరు ఊర్వశి అప్సర… అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ గా పని చేస్తుంది. అందులో భాగంగానే అల్లు అర్జున్ తో కలిసి సాంగ్ ప్రాక్టీస్ చేసినట్టుగా తెలుస్తోంది…ఇటు చూడడానికి హీరోయిన్ ని మించిన అందంతో ఉన్న ఈ అమ్మడు చేసిన డాన్స్ కి ఎక్స్ప్రెషన్స్ కి ప్రస్తుతం యూత్ మొత్తం ఫిదా అయిపోతున్నారనే చెప్పాలి.
ఇక ఏది ఏమైనా కూడా అల్లు అర్జున్ లాంటి స్టార్ హీరో పక్కన నటించే అవకాశం రాకపోయిన కూడా మేకింగ్ వీడియోలో అతనికి డాన్స్ ప్రాక్టీస్ చేయిస్తూ కనిపించిన ఈ అమ్మడుకి కొరియోగ్రాఫర్ గా చాలా మంచి లైఫ్ అయితే ఉందని చాలామంది చెప్పుకుంటున్నారు. ఇంకా ఏది ఏమైనా కూడా కొరియోగ్రాఫర్ గానే కాకుండా యోగ ఇన్ఫ్లియెన్సర్ గా, నటిగా చేస్తుండటం విశేషం…