Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ సీజన్ 7కి రంగం సిద్ధం అవుతుంది. కంటెస్టెంట్స్ ఎంపిక కూడా పూర్తి అయ్యింది. షోకి ఎంపికైన కొందరు సెలెబ్స్ పేర్లు బయటకు వచ్చాయి. ఈసారి 20 మంది పోటీదారులు ఉండే అవకాశం కలదు. గత సీజన్ అనుభవాల దృష్ట్యా పేరున్న వాళ్ళను హౌస్లోకి పంపే ప్రయత్నం జరుగుతుందట. ఆడియన్స్ ని ఆకర్షించేందుకు పాప్యులర్ పర్సనాలిటీస్ ని ఎంపిక చేశారట. బిగ్ బాస్ తెలుగు ఇప్పటివరకు ఆరు సీజన్స్ కంప్లీట్ చేసుకుంది. ఐదు సీజన్స్ విశేష ఆదరణ పొందాయి. అయితే సీజన్ 6 దారుణ పరాజయం చవి చూసింది.
కనీసం ఓ సీరియల్ కి వచ్చే టీఆర్పీ కూడా బిగ్ బాస్ షోకి రాలేదు. వీకెండ్స్ లో 3-4, వీక్ డేస్ లో 2 టీఆర్పీ నమోదైంది. ఫైనల్ ఎపిసోడ్ సైతం పూర్తిగా నిరాశపరిచింది. బిగ్ బాస్ చరిత్రలో వరస్ట్ టీఆర్పీ బిగ్ బాస్ 6 సొంతమైంది. దీంతో సీజన్ 7 గట్టిగా ప్లాన్ చేస్తున్నారు. అవే టాస్క్స్, గేమ్స్, రూల్స్ వలన ప్రేక్షకులు కిక్ ఫీల్ కావడం లేదు. అందుకే సీజన్ 7 కి అంతా మార్చేశారని తెలుస్తుంది.
ఇక ప్రోమోలు కూడా ఆసక్తిగా మలుస్తున్నారు. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. ఊహించని మలుపులు ఉంటాయని, క్లైమాక్స్ అంచనా వేయలేరనట్లు ప్రోమోలు సిద్ధం చేస్తున్నారు. బిగ్ బాస్ 7 లేటెస్ట్ ప్రోమో మరింత ఆసక్తిగా ఉంది. ప్రేమికుడు కొండపై నుండి జారిపోతుంటే ప్రేయసి కాపాడే ప్రయత్నం చేస్తుంది. ఈ ప్రోమోలో నటించిన అమ్మాయి అందరినీ ఆకర్షించింది. ఇంతకీ ఎవరీ నటి అని ఆరా తీయడం మొదలుపెట్టారు. ఆ అమ్మాయి పేరు అలేఖ్య రెడ్డి. పరిశ్రమకు వచ్చి చాలా కాలం అవుతుంది.
అలేఖ్య రెడ్డి పలు చిత్రాల్లో సపోర్టింగ్ రోల్స్ చేశారు. దాంతో ఆమెకు ఫేమ్ రాలేదు. ఇటీవల విడుదలైన ఇంటింటి రామాయణం, అశోకవనంలో అర్జున కళ్యాణం, అర్థమైందా అర్జున్ కుమార్ వంటి సినిమాలు, వెబ్ సిరీస్లలో ఆమె నటించారు. అనూహ్యంగా బిగ్ బాస్ ప్రోమోతో ఆమెకు ఫేమ్ వచ్చింది. ఇక బిగ్ బాస్ 7 సెప్టెంబర్ మొదటి వారం నుండి మొదలు కానుంది సమాచారం.
https://www.youtube.com/watch?v=mpBjYkgZQMg&t=78s