spot_img
Homeఎంటర్టైన్మెంట్Bigg Boss 6 Telugu Voice Person Name: తెరవెనుక నుండి కంటెస్టెంట్స్ ని భయపెట్టే...

Bigg Boss 6 Telugu Voice Person Name: తెరవెనుక నుండి కంటెస్టెంట్స్ ని భయపెట్టే ఆ బిగ్ బాస్ వాయిస్ ఎవరిదో తెలుసా?

Bigg Boss 6 Telugu Voice Person Name: ఎక్కడో విదేశాల్లో బిగ్ బ్రదర్ రియాలిటీ షోగా ప్రాచుర్యం పొందిన టెలివిజన్ షోని బిగ్ బాస్ గా ఇండియాకు తీసుకొన్నారు. 2007లో నటుడు అర్షద్ వార్షి హోస్ట్ గా బిగ్ బాస్ హిందీ ఫస్ట్ సీజన్ ప్రారంభమైంది. అప్పటి నుండి అప్రతిహతంగా షో కొనసాగుతుంది. శిల్పా శెట్టి, అమితాబ్, సంజయ్ దత్ బిగ్ బాస్ హోస్ట్స్ గా చేశారు. అయితే సీజన్ 4లో ఎంట్రీ ఇచ్చిన సల్మాన్ ఖాన్ తన మార్కు హోస్టింగ్ స్కిల్స్ తో సెటిల్ అయ్యారు. ప్రస్తుతం సీజన్ 16 నడుస్తుంది. అక్టోబర్ 1న స్టార్ అయ్యింది. హిందీలో సూపర్ సక్సెస్ కాగా అన్ని ప్రధాన ప్రాంతీయ భాషలకు ఇది విస్తరించింది.

Bigg Boss 6 Telugu Voice Person Name
Radhakrishna

హిందీలో మొదలైన పదేళ్లకు 2017లో స్టార్ మా బిగ్ బాస్ షోని తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేసింది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్ గా ఫస్ట్ సీజన్ స్టార్ట్ అయ్యింది. టాప్ సెలెబ్రిటీలు పాల్గొన్న సీజన్ వన్ ట్రెమండస్ సక్సెస్ కొట్టింది. షో గురించి పూర్తిగా అవగాహన లేకున్నా ఆడియన్స్ ఎగబడి చూశారు. ఫస్ట్ సీజన్ విన్నర్ గా శివబాలాజీ అవతరించారు. కమిట్మెంట్స్ కారణంగా ఎన్టీఆర్ సీజన్ 2 నుండి తప్పుకున్నారు. నాచురల్ స్టార్ నాని హోస్ట్ అవతారం ఎత్తారు. నానికి యావరేజ్ మార్కులు పడ్డాయి.

సీజన్ 3 లో ఎంట్రీ ఇచ్చిన నాగార్జున షోకి మరింత ఆదరణ తీసుకొచ్చారు. హోస్టింగ్ కి ఒక బెంచ్ మార్క్ సెట్ చేశారు. నాగార్జున సారథ్యంలో బిగ్ బాస్ సీజన్స్ సక్సెస్ ఫుల్ గా సాగుతున్నాయి. అధిక టిఆర్పి రాబడుతున్నాయి. తెలుగులో బిగ్ బాస్ షో సక్సెస్ కావడానికి మరొక కారణం బిగ్ బాస్ కూడాను. తెరవెనుక నుండి వినిపించే బిగ్ బాస్ వాయిస్ ఆసక్తికరంగా ఉంటుంది. గంభీరమైన స్వరంతో కంటెస్టెంట్స్ కి ఆదేశాలిచ్చే బిగ్ బాస్ గొంతు ప్రేక్షకుల్లో ఎక్కడలేని క్యూరియాసిటీ కలగజేస్తుంది.

Bigg Boss 6 Telugu Voice Person Name
Bigg Boss 6 Telugu Voice Person Name

బిగ్ బాస్ ప్రేక్షకులు ఒకసారి బిగ్ బాస్ ని చూడాలని కోరుకుంటారు. ఎలాంటి ఎమోషన్స్ చూపించకుండా కేవలం రూల్స్, రెగ్యులేషన్స్ మాట్లాడుతూ కంటెస్టెంట్స్ ని బిగ్ బాస్ గైడ్ చేస్తూ ఉంటాడు. చివరికి హోస్ట్ నాగార్జునకు కూడా ఆదేశాలిచ్చే అధికారం బిగ్ బాస్ కి ఉంటుంది. ఆయన కూడా బిగ్ బాస్ మాట వినాల్సిందే. అంతలా కట్టిపడేసే ఆ బిగ్ బాస్ వాయిస్ రాధాకృష్ణ అనే డబ్బింగ్ ఆర్టిస్ట్ ది. ఆయన చాలా కాలంగా సినిమాలు, సీరియల్స్ కి డబ్బింగ్ ఆర్టిస్ట్ గా పనిచేస్తున్నారు. రాధాకృష్ణ వాయిస్ బిగ్ బాస్ క్యారెక్టర్ కి చక్కగా సెట్ అయ్యింది. దీంతో అన్ని సీజన్స్ కి ఆయనే బిగ్ బాస్ వాయిస్ అందిస్తున్నారు.

 

Shiva
Shivahttps://oktelugu.com/
Shiva Shankar is a Senior Cinema Reporter Exclusively writes on Telugu cinema news. He has very good experience in writing cinema news insights and celebrity updates, Cinema trade news and Nostalgic articles and Cine celebrities and Popular Movies. Contributes Exclusive South Indian cinema News.

Most Popular

Ram Gopal Varma: ఆ హీరోను చంపేస్తా…ఆర్జీవీ కి చెప్పిన ఫ్యాక్షనిస్టు…వైరల్ వీడియో…

Ram Gopal Varma: 'శివ' సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీ దశాదిశా మార్చిన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ...అప్పటి వరకు తెలుగు సినిమాలు అంటే ఒక మూస ధోరణి కథలతో సాగేవిగా ఉండేవి...కానీ...

YSRCP: వైసీపీలో కాపు నేతల తిరుగుబాటు!

YSRCP: కాపు అస్త్రంతో కూటమిని చీల్చాలని జగన్మోహన్ రెడ్డి భావించారు. ఇప్పుడు అదే కాపు అస్త్రం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని గుచ్చుకోబోతోంది. కూటమిని ఇరకాటంలో పెట్టేందుకు, కాపు ఓటు బ్యాంకు ను ఆకట్టుకోవడానికి...

Nagarjuna: రాజమౌళి – అఖిల్ కాంబోను సెట్ చేయాలని చూసిన నాగార్జున…జక్కన్న రియాక్షన్ ఇదేనా…

Nagarjuna: దర్శక ధీరుడు రాజమౌళి చేసే ప్రతి సినిమా విషయంలో చాలా క్లారిటి ని మెయింటైన్ చేస్తున్నాడు. ఇక ఇప్పటివరకు ఆయన చేసిన ప్రతి సినిమా సక్సెస్ ను సాధించాడానికి గల ముఖ్య...

Music Directors: ఈ ముగ్గురు మ్యూజిక్ డైరెక్టర్స్ కి తిరుగులేదా…

Music Directors: సినిమా ఇండస్ట్రీలో మ్యూజిక్ డైరెక్టర్లకు చాలా మంచి గుర్తింపైతే ఉంటుంది. ఒక సినిమా సక్సెస్ లో వాళ్ళు కీలకపాత్ర వహిస్తుంటారు. ఇక ఏది ఏమైనా కూడా ఒక సినిమాని...

Jagan Mohan Reddy: జగన్ కోసం ఢిల్లీలో రంగంలోకి ఆ సీనియర్!

Jagan Mohan Reddy: అధికారంలో ఉన్నప్పుడు ఆ దర్పం వేరేలా ఉంటుంది. కోల్పోతే అసలు విషయం తెలిసి వస్తుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి అదే ఎదురైంది. ఒకప్పుడు ఢిల్లీలో అడుగుపెడితే చాలు రాచమర్యాదలు...
Oktelugu Epaper
Exit mobile version