https://oktelugu.com/

Tollywood: టాలీవుడ్ యంగ్ హీరోల్లో టాప్ హీరో ఎవరో తెలుసా..?

ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీ పాన్ ఇండియాలో నెంబర్ వన్ ఇండస్ట్రీ గా కొనసాగుతుంది. స్టార్ హీరోలు వరుస సినిమాలతో భారీ విజయాలను సాధిస్తూ వందల కోట్ల కలెక్షన్స్ ను కొల్లగొడుతుంటే యంగ్ హీరోలు మాత్రం తమదైన రీతిలో సినిమాలు చేస్తూ సక్సెస్ లను సాధించడానికి రెడీ అవుతున్నారు...

Written By:
  • Gopi
  • , Updated On : October 27, 2024 / 12:21 PM IST

    Tollywood(10)

    Follow us on

    Tollywood: ప్రస్తుతం కొత్త కథలతో ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా తమదైన రీతిలో సినిమాలు చేయడానికి యంగ్ హీరోలు ఆసక్తి చూపిస్తున్నారు. ఇక అందుకే వాళ్ళు చేసే ప్రతి సినిమా విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు సాగడమే కాకుండా స్టార్ హీరోలకు సైతం తాము ఏమాత్రం తీసిపోమని భారీ సక్సెస్ లను సాధిస్తున్నారు. ఇక రీసెంట్ గా యంగ్ హీరోలందరూ మంచి సినిమాలు చేయడం విశేషం… ఇక విజయ్ దేవరకొండ లాంటి హీరో కొంతవరకు ప్లాపులతో సతమతమవుతున్నప్పటికి ఇప్పుడు చేస్తున్న మూడు పాన్ ఇండియా సినిమాలతో భారీ సక్సెస్ లను సాధించాలని చూస్తున్నాడు. ఇక నాని వరుసగా సక్సెస్ ల మీద సక్సెస్ లను అందుకుంటూ ముందుకు సాగుతున్నాడు. కాబట్టి ప్రస్తుతం నాని మీడియం రేంజ్ హీరోలో నెంబర్ వన్ హీరోగా కొనసాగుతున్నాడు. అతనికి సక్సెస్ రేట్ తో పాటు క్రేజ్ కూడా ఎక్కువగా ఉండడం విశేషం… ఇక విజయ్ దేవరకొండ కి యూత్ లో మంచి ఫాలోయింగ్ అయితే ఉంది. కానీ ఆయన సినిమాలు ప్రస్తుతం డీలాపడుతూ ఉండడంతో ఆయన క్రేజ్ అనేది అంతకంతకు తగ్గుతూ వస్తుందే తప్ప పెరగడం లేదు…

    ఇక నితిన్, నిఖిల్, విశ్వక్ సేన్, సందీప్ కిషన్, కిరణ్ అబ్బవరం లాంటి నటులు కూడా ఇప్పుడు వాళ్ళను వాళ్ళు ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరమైతే ఉంది. ఎందుకంటే వరుస సినిమాలతో సక్సెస్ లను సాధిస్తే ఇక్కడ మీడియం రేంజ్ హీరోలుగా కన్సిస్టెంట్ గా కొనసాగడమే కాకుండా రెమ్యూనరేషన్ విషయంలో కూడా చాలా వరకు డిమాండ్ చేసే అవకాశాలైతే ఉంటాయి.

    కాబట్టి ఎవరికి వారు వాళ్ళను వాళ్ళు ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరమైతే వచ్చిందనే చెప్పాలి… ఇక ప్రస్తుతం కిరణ్ అబ్బవరం క సినిమాతో ఒక పెను ప్రభంజనాన్ని సృష్టించడానికి రెడీ అవుతున్నట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే ఆయన సినిమా నుంచి వచ్చిన ట్రైలర్ ను చూస్తే ఈజీగా అర్థమవుతుంది. ఇది పాన్ ఇండియా సినిమాగా రావడమే కాకుండా ప్రేక్షకులందరిని మెప్పించే విధంగా కూడా ముందుకు సాగబోతుందనే విషయం చాలా స్పష్టంగా తెలుస్తోంది. ఇక ఈ సినిమా ఈనెల 31వ తేదీన రిలీజ్ కి రెడీ అవుతున్న నేపధ్యంలో పాన్ ఇండియాలో ఈయన భారీ సక్సెస్ ని సాధిస్తాడా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది.

    ఇక ఇప్పటికే నిఖిల్ కూడా కార్తికేయ 2 సినిమాతో పాన్ ఇండియాలో మంచి మార్కెట్ ని క్రియేట్ చేసుకున్నాడు. కాబట్టి ఈ హీరో కూడా ఇప్పుడు ‘స్వయంభు ‘ సినిమాతో మరోసారి ప్రేక్షకులను పలకరించడానికి సిద్ధమవుతున్నాడు…