Kathanayakudu: కొన్ని సినిమాలు బాగున్నప్పటికీ కూడా కొన్ని అనుకోని కారణాల వల్ల అట్టర్ ఫ్లాప్ అవ్వడం వంటివి జరుగుతుంటాయి. కానీ ఆ సినిమాలు టీవీ టెలికాస్ట్ అప్పుడు మాత్రం, ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ ని దక్కించుకుంటూ ఉంటాయి. అలాంటి సినిమాలలో ఒకటి ‘కథానాయకుడు’. సూపర్ స్టార్ రజినీకాంత్ మరియు జగపతి బాబు కాంబినేషన్ లో వచ్చిన ఈ సినిమా అప్పట్లో మంచి టాక్ ని అయితే తెచ్చుకుంది కానీ, బాక్స్ ఆఫీస్ పరంగా మాత్రం ఆశించిన స్థాయిలో ఆడలేదు.
ఎందుకంటే ఈ చిత్రం లో అందరూ రజినీకాంత్ హీరో అని అనుకున్నారు. కానీ ఆ సినిమాలో రజినీకాంత్ కేవలం ఒక ముఖ్య పాత్రని మాత్రమే పోషించాడని ,అసలు హీరో జగపతి బాబు అని తెలియడం తో ఆడియన్స్ అంచనాలు తప్పి ఫ్లాప్ అయ్యింది. కానీ ఆ తర్వాత టీవీ టెలికాస్ట్ లో మాత్రం ఈ చిత్రానికి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.
అయితే ఈ సినిమాలో జగపతి బాబు పాత్రకి ముందుగా విక్టరీ వెంకటేష్ ని తీసుకుందాం అనుకున్నారట. ఆయనకి ఇలాంటి పాత్రలు చాలా బాగా సూట్ అవుతాయి. తన అద్భుతమైన సెంటిమెంటల్ యాక్టింగ్ తో ప్రేక్షకుల చేత కన్నీళ్లు పెట్టించేస్తాడు. అలాంటి పాత్రలు అనుకున్నప్పుడు ముందుగా ఎవరికైనా వెంకటేష్ మాత్రమే గుర్తుకు వస్తాడు. కానీ ఆ సినిమా సమయం లో వెంకటేష్ వేరే ప్రాజెక్ట్స్ తో బిజీ అవ్వడం వల్ల, ఆ ప్రాజెక్ట్ ఆయన చేతి నుండి జగపతి బాబు చేతుల్లోకి వెళ్ళింది.
ఇక ఆ తర్వాత హిస్టరీ మొత్తం మనకి తెలిసిందే. సినిమాకి మంచి టాక్ అయితే వచ్చింది కానీ, అంచనాలు తప్పడం వల్ల ఫ్లాప్ అయ్యింది. కానీ ఈ సినిమాలో కొన్ని సన్నివేశాలను మాత్రం ఎప్పటికీ మరచిపోలేము, వాటిల్లో క్లైమాక్స్ ఒకటి, ఇలాంటి సన్నివేశాలు వెంకటేష్ కి పడి ఉంటె వేరే లెవెల్ లో ఈ చిత్రం ఆడేది అని వెంకీ ఫ్యాన్స్ ఇప్పటికీ ఫీల్ అవుతూనే ఉంటారు.