Baby John: బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్, సౌత్ ఇండియన్ బ్యూటీ కీర్తి సురేష్ జంటగా నటించిన సినిమా బేబీ జాన్ ఇటీవలే డిసెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ సినిమాకు అట్లీ దర్శకత్వం వహించారు. భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా అంతగా ఆకట్టుకోలేదని తెలుస్తుంది. ఈ సినిమా థియేటర్లలో రిలీజ్ అవ్వడానికి 20 రోజుల ముందు హిందీలో పుష్ప 2 సినిమా రూ. 700 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి రికార్డ్ క్రియేట్ చేసింది. ఇక అదే సమయంలో రిలీజ్ అయిన వరుణ్ ధావన్ బేబీ జాన్ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర నిరాశపరిచింది. ఇప్పటివరకు బేబీ జాన్ సినిమా రూ. 43 కోట్లు వసూళ్లను రాబట్టిందని సమాచారం. అయితే దాదాపుగా రూ. 160 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఇప్పటివరకు కేవలం రూ. 43 కోట్లు వసూళ్లను మాత్రమే రాబట్టగలిగింది. ఇదిలా ఉంటే సౌత్ ఇండియా స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ బేబీ జాన్ సినిమాతో బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే ప్రస్తుతం కీర్తి సురేష్ పేరును ఒక టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రికమెండ్ చేసిందని ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. స్వయంగా ఈ విషయాన్ని హీరోయిన్ కీర్తి సురేష్ చెప్పుకొచ్చింది. కీర్తి సురేష్ పేరును రికమెండ్ చేసిన ఆ స్టార్ హీరోయిన్ మరెవరో కాదు సమంత. బేబీ జాన్ సినిమా కు తన పేరును సజెస్ట్ చేసింది సమంత అని హీరో వరుణ్ ధావన్ ఈ విషయాన్ని తనతో చెప్పినట్లు తెలిపింది కీర్తి సురేష్.
తమిళ్ లో వచ్చిన తేరి సినిమాలో సమంత నటించిన పాత్ర తనకు చాలా ఇష్టమని అదే పాత్రను హిందీలో తాను పోషించేందుకు చాలా భయపడ్డానని కీర్తి సురేష్ తెలిపింది. తమిళ్ లో తేరి సినిమాని దర్శకుడు అట్లీ తెరకెక్కించారు. ఈ సినిమాలో సమంత, అమీ జాక్సన్, విజయ్ దళపతి ప్రధాన పాత్రలలో నటించడం జరిగింది. ఈ సినిమాలో రాధికా శరత్ కుమార్ కూడా కీలక పాత్రలో నటించారు. ఇక 2016లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర భారీ విజయం సొంతం చేసుకుంది. అప్పట్లో ఈ సినిమా రూ. 125 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి సూపర్ హిట్ సాధించింది.
ఇక ఇదే సినిమాను హిందీలో బేబీ జాన్ పేరుతో రీమేక్ చేశారు థర్సకుడు అట్లీ. కథలో కొన్ని మార్పులు చేసి యాక్షన్స్ అన్నివేశాలను భారీగా తీసి రూ. ల్స్ 160 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ సినిమాను హిందీలో రీమేక్ చేశారు దర్శకుడు. అయితే భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఇప్పటివరకు రూ. 43 కోట్ల వసూళ్లను మాత్రమే రాబట్టింది.