https://oktelugu.com/

Sarileru Neekevvaru: షాకింగ్..’సరిలేరు నీకెవ్వరూ’ సినిమాని మిస్ చేసుకున్న స్టార్ హీరో అతనేనా..? ఒప్పుకొని చేసి ఉంటే అదే రేంజ్ హిట్ అయ్యేదా.!

ఈ సినిమా ఇప్పటికీ కూడా నాన్ రాజమౌళి టాప్ 5 సినిమాలలో ఒకటిగా కొనసాగుతూ ఉంది, చాలామంది స్టార్ హీరోల సినిమాలు విడుదల అయ్యాయి కానీ, ఒక్క సినిమా కూడా ఈ చిత్రం రికార్డ్స్ ని బద్దలు కొట్టలేకపోయాయి. మహేష్ బాబు ఎంటర్టైన్మెంట్ జానర్ లో సినిమా తీస్తే బాక్స్ ఆఫీస్ విద్వంసం ఏ రేంజ్ లో ఉంటుందో చెప్పడానికి ఇది ఒక ఉదాహరణగా చెప్పవచ్చు. అయితే ఈ సినిమాకి సంబంధించిన ఒక ఆసక్తికరంగా వార్త ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది.

Written By: , Updated On : July 12, 2023 / 08:04 PM IST
Sarileru Neekevvaru

Sarileru Neekevvaru

Follow us on

Sarileru Neekevvaru: సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్ లో భారీ వసూళ్లను రాబట్టిన నెంబర్ 1 సినిమా ‘సరిలేరు నీకెవ్వరూ’. 2020 వ సంవత్సరం లో సంక్రాంతి కానుకగా ‘అలా వైకుంఠపురం లో’ చిత్రం తో పాటుగా విడుదలైన ఈ సినిమా అప్పట్లో 130 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టింది. ఒక మామూలు సినిమా ఆ స్థాయి వసూళ్లు సాధించడం అనేది సాధారణామైన విషయం కాదు.

ఈ సినిమా ఇప్పటికీ కూడా నాన్ రాజమౌళి టాప్ 5 సినిమాలలో ఒకటిగా కొనసాగుతూ ఉంది, చాలామంది స్టార్ హీరోల సినిమాలు విడుదల అయ్యాయి కానీ, ఒక్క సినిమా కూడా ఈ చిత్రం రికార్డ్స్ ని బద్దలు కొట్టలేకపోయాయి. మహేష్ బాబు ఎంటర్టైన్మెంట్ జానర్ లో సినిమా తీస్తే బాక్స్ ఆఫీస్ విద్వంసం ఏ రేంజ్ లో ఉంటుందో చెప్పడానికి ఇది ఒక ఉదాహరణగా చెప్పవచ్చు. అయితే ఈ సినిమాకి సంబంధించిన ఒక ఆసక్తికరంగా వార్త ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది.

అదేమిటంటే ఈ చిత్రాన్ని తొలుత మహేష్ బాబు కోసం కాకుండా జూనియర్ ఎన్టీఆర్ కోసం రాసుకున్నాడట ఆయా చిత్ర డైరెక్టర్ అనిల్ రావిపూడి. ఒకసారి ఎన్టీఆర్ గతో సినిమా చెయ్యాలని నిర్ణయించుకున్నప్పుడు, ఆయనని కలిసాయి వినిపించిన స్టోరీ ఇదేనట. బాగుంది భవిష్యత్తులో చేద్దాం అని అన్నాడట ఎన్టీఆర్. ఎందుకంటే అప్పుడే ఆయన #RRR చిత్రానికి కమిట్ అయ్యి ఉన్నాడు. దాంతో వీళ్లిద్దరి కాంబినేషన్ లో సినిమా రాలేకపోయింది.

ఇది ఇలా ఉండగా , కొంత కాలం తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు నుండి కాల్ వచ్చాడట, ఒక కథ ఉంది అని అన్నావట కదా, వచ్చి న్యారేట్ చెయ్యమన్నాడట. అప్పుడు ఆయన దగ్గర ఉన్న సరిలేరు నీకెవ్వరూ చిత్రం స్టోరీ ని వినిపించాడట. మహేష్ బాబు కి బాగా నచ్చింది , వెంటనే సినిమా ప్రారంభించారు. ఈ విషయం చాలా కాలం తర్వాత బయట పడడం తో సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.