Adipurush: యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం ‘ఆదిపురుష్’ వచ్చే నెల 16 వ తారీఖున ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదల అవ్వబోతుంది. ఈ సందర్భంగా ట్రైలర్ ని మొన్నీమధ్యనే విడుదల చేసారు. రెస్పాన్స్ అదిరిపోయింది, కానీ ప్రభాస్ లుక్స్ మరియు డైలాగ్ డెలివరీ మీద సోషల్ మీడియా ట్రోల్ల్స్ ఎక్కువ అయిపోయాయి. రాముడికి ఎక్కడైనా మీసాలు ఉంటుందా, ప్రభాస్ ఎందుకు తన లుక్స్ విషయం లో ఇంత నిర్లక్ష్యం చేసాడు, డైలాగ్స్ కూడా చాలా బద్ధకం గా చెప్తున్నాడు, సినిమాకి మైనస్ ఆయన ఒక్కడే అయ్యేలా ఉన్నాడు అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ ట్రోల్ల్స్ చేసారు.
అయితే కేవలం రెండు నిమిషాల ట్రైలర్ ని చూసి డిసైడ్ చెయ్యడం ఏమాత్రం సరికాదని, సినిమా చూసిన తర్వాత నోరు జారిన ప్రతీ ఒక్కరికి తన సక్సెస్ తో సమాధానం చెప్తాడు ప్రభాస్ అంటూ ఫ్యాన్స్ బలమైన నమ్మకం తో ఉన్నారు.
అయితే ఈ సినిమాని దర్శకుడు ఓం రౌత్ తొలుత హ్రితిక్ రోషన్ తో చెయ్యాలని అనుకున్నాడట..శ్రీ రాముడిగా హృతిక్ రోషన్ మరియు రావణాసురిడి పాత్రలో ప్రభాస్ ని పెట్టాలనుకున్నాడట. కానీ హృతిక్ రోషన్ కొన్ని కీలక మార్పులు చెయ్యాలని సూచించడం, అది డైరెక్టర్ ఓం రౌత్ కి నచ్చకపోవడం తో ఈ ప్రాజెక్ట్ సెట్స్ మీదకి పోలేదు.
ఆ తర్వాత కొన్ని రోజులకు ప్రభాస్ ని శ్రీరాముడిగా మరియు సైఫ్ అలీ ఖాన్ ని రావణాసురిడిగా పెట్టి ‘ఆది పురుష్’ చిత్రాన్ని తీశారు.ఈ సినిమాని మోషన్ కాప్చర్ టెక్నాలజీ తో తెరకెక్కించారట. ట్రైలర్ లో మనం చూసే వానరసైన్యం మొత్తాన్ని మోషన్ కాప్చర్ టెక్నాలజీ ద్వారానే క్రియేట్ చెయ్యబడినదే అట, ట్రైలర్ చూస్తున్నప్పుడే ఆడియన్స్ కి అద్భుతమైన అనుభూతి కలిగింది, ఇక సినిమా మొత్తం థియేటర్ లో ఎలాంటి అనుభూతిని కలిగించబోతుందో చూడాలి.