Salaar: రీసెంట్ గా రిలీజ్ అయిన సలార్ సినిమా బాక్సాఫీస్ వద్ద రికార్డు కలక్షన్లను నమోదు చేస్తుంది. ఇక అందులో భాగంగానే ఈ సినిమా సూపర్ సక్సెస్ సాధించే దిశగా ముందుకు దూసుకెళ్తుంది. ఇక ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా1000 కోట్లకు పైన కలక్షన్లను వసూలు చేస్తుందనే టాక్ అయితే నడుస్తుంది. ఇక ఇదిలా ఉంటే ప్రశాంత్ నీల్ ముందుగా ఈ సినిమాని ప్రభాస్ తో కాకుండా వేరే హీరోతో చేద్దామని ప్లాన్ లో ఉన్నాడంట ఆ హీరోకి కథ కూడా చెప్పాడట ఆయన ఆ కథ కూడా విన్నాడట ఆ తర్వాత స్క్రిప్ట్ నచ్చక ఈ సినిమాని రిజక్ట్ చేశాడట దాంతో ఈ స్టోరీ ని ప్రశాంత్ నీల్ ప్రభాస్ తో తెరకెక్కించాలనుకొని ఆయనకు కథ చెప్పి ఆయనతో కథ ఓకే చేయించుకొని ఈ సినిమాని చేశాడు.
ఇక దాని ఫలితంగా ఇప్పుడు ఈ సినిమా సూపర్ సక్సెస్ సాధించింది. అయితే ఈ సినిమాని మిస్ చేసుకున్న ఆ అన్ లక్కీ హీరో ఎవరు అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతుంది. ఆయన ఎవరు అంటే తెలుగులో స్టైలిష్ స్టార్ గా గుర్తింపు పొందిన అల్లు అర్జున్…ఈయన ఇప్పటికే పుష్ప సినిమాతో పాన్ ఇండియా రేంజ్ లో మంచి పేరు సంపాదించుకున్నాడు. ఇక ప్రస్తుతం పుష్ప 2 సినిమా షూటింగ్ లో బిజీ గా గడుపుతున్నాడు. ఇక ఇదిలా ఉంటే ఒకవేళ సలార్ సినిమా స్క్రిప్ట్ ఆయనకు నచ్చిన కూడా ఆయన ఈ సినిమా చేసేవాడు కాదని తెలుస్తుంది.
ఎందుకంటే ఆయన పుష్ప 2 సినిమాలో బిజీగా ఉన్నాడు కాబట్టి సలార్ సినిమా చేసే టైం అతనికి లేకపోవడంతో ఆయన ఈ సినిమాని వదులుకోవాల్సి వచ్చేది ఇక ఎలాగూ స్క్రిప్ట్ పట్ల ఆయన కొంచెం అసంతృప్తిగా ఉండడం కూడా దానికి కారణం కావడం వల్ల ఈ సినిమాని వదిలేసుకోవాల్సి వచ్చింది. ఇక ప్రస్తుతం అల్లు అర్జున్ పుష్ప 2 సినిమాతో బిజీగా గడుపుతున్నాడు.ఇక ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్ లో భారీ సక్సెస్ సాధిస్తుందనే ఉద్దేశంతో ఉన్నారు.
మరి ఈ సినిమా ఎంతవరకు సక్సెస్ సాధిస్తుంది అనే విషయం తెలియాలంటే ఈ సినిమా రిలీజ్ అయ్యేంత వరకు వెయిట్ చేయాల్సిందే…ఇక ఈ సినిమా తర్వాత ప్రశాంత్ నీల్ ఎన్టీయార్ తో సినిమా చేస్తాడు…