https://oktelugu.com/

Puri Jagannath – Rana : పూరి రానాతో చేసిన ‘నేను నా రాక్షసి’ ప్లాప్ కి కారణం ఎవరో తెలుసా..? వీళ్ల కాంబో లో మరో సినిమా ఎప్పుడంటే..?

ఎందుకంటే పూరి ప్రస్తుతం రామ్ ని హీరోగా పెట్టి 'డబుల్ ఇస్మార్ట్ ' అనే సినిమా చేస్తున్నాడు. ఇక రానా కూడా పాన్ ఇండియాలో మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు కాబట్టి తొందర్లోనే వీళ్ల కాంబినేషన్ లో మరొక సినిమా వచ్చిన ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదని చాలామంది సినిమా మేధావులు సైతం వాళ్ళ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.

Written By:
  • NARESH
  • , Updated On : March 19, 2024 / 06:33 PM IST

    Puri Jagannath - Rana

    Follow us on

    Puri Jagannath – Rana : తెలుగు సినిమా ఇండస్ట్రీలో పూరి జగన్నాథ్ కి ఉన్న క్రేజ్ మరే దర్శకుడు కి లేదని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఎందుకంటే అప్పట్లో ఆయన యూత్ ను అట్రాక్ట్ చేస్తూ సినిమాలు చేయడంలో దిట్ట.. ఆయన ఒక డైలాగ్ రాసాడు అంటే యూత్ మొత్తం అదే ఫాలో అవుతూ ఉండేవారు. అంతటి క్రేజ్ సంపాదించుకున్న దర్శకుడు బహుశా సౌత్ సినిమా ఇండస్ట్రీలోనే ఎవరూ లేరేమో..మంచి సినిమాలు తీశాడు కాబట్టే పూరి అంటే ప్రతి ఒక్క అభిమానికి చాలా ఇష్టం ఉంటుంది.

    ఇక ఇదిలా ఉంటే పూరి రానాను హీరోగా, ఇలియానా ను అని హీరోయిన్ గా పెట్టి చేసిన ‘నేను నా రాక్షసి’ సినిమా భారీ డిజాస్టర్ అయ్యింది. అయితే ఈ సినిమా డిజాస్టర్ కి కారణం ఎవరు అనే వార్తలు అప్పట్లో సంచలనాను రేకెత్తించాయి. ముఖ్యంగా పూరి రానా తో ఒక మంచి లవ్ స్టోరీ చేయాలని అనుకున్నారట. కానీ అనుకోని కారణాలవల్ల నేను నా రాక్షసి సినిమాని చేయాల్సి వచ్చింది. అయితే పూరి రానాకి చెప్పిన కథ వేరు ఆ తర్వాత సినిమాగా చేసే టైమ్ లో మారిన కథ వేరు అని అప్పట్లో రూమర్లు అయితే చెక్కర్లు కొట్టాయి. దానివల్లే ఈ సినిమా అనుకున్న స్థాయిలో విజయం సాధించలేదనే వార్తలు కూడా వచ్చాయి.

    ఇక ఏది ఏమైనప్పటికీ రానా ఖాతాలో మాత్రం ఒక భారీగా డిజాస్టర్ పడింది. ఇక పూరి జగన్నాథ్ కూడా ఈ సినిమాతో భారీ ఫ్లాప్ ని చవి చూడాల్సి వచ్చింది. ఇక మొత్తానికైతే పూరి రానా కాంబినేషన్ ఫ్లాప్ కాంబో గా మిగిలిపోయింది. ఇక ఇప్పుడు వీళ్ళ కాంబినేషన్ లో మరొక సినిమా ఏదైనా వచ్చే అవకాశం ఉందా అంటే, వస్తే రావచ్చు అనే అభిప్రాయాలైతే వ్యక్తమవుతున్నాయి.

    ఎందుకంటే పూరి ప్రస్తుతం రామ్ ని హీరోగా పెట్టి ‘డబుల్ ఇస్మార్ట్ ‘ అనే సినిమా చేస్తున్నాడు. ఇక రానా కూడా పాన్ ఇండియాలో మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు కాబట్టి తొందర్లోనే వీళ్ల కాంబినేషన్ లో మరొక సినిమా వచ్చిన ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదని చాలామంది సినిమా మేధావులు సైతం వాళ్ళ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.