Daaku Maharaja: బాలయ్య బాబు హీరోగా బాబీ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న సినిమా ‘డాకు మహారాజ్’ అయితే ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ను రీసెంట్ గా రిలీజ్ చేశారు. ఈ సినిమా విషయంలో బాలయ్య బాబు బాబీ ఇద్దరూ కూడా చాలా మంచి కాన్ఫిడెంట్ తో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక ఈ సినిమా ఎలాంటి సక్సెస్ సాధిస్తుంది అనే విషయాన్ని తెలుసుకోడానికి నందమూరి అభిమానులు కూడా చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక సంక్రాంతి కానుకగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తున్న విషయం మనకు తెలిసిందే. మొత్తానికైతే ఈ సినిమాతో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను క్రియేట్ చేసుకోవాలని చూస్తున్న బాలయ్య బాబు మరోసారి తనదైన రీతిలో సత్తా చాటుకుంటాడా? లేదా అనే విషయాలు కూడా తెలియాల్సి ఉన్నాయి. ఇక మొత్తానికైతే బాలయ్య బాబు మాస్ జాతర చేయబోతున్నాడనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఇక ఇంతకుముందు ఆయన చేసిన సినిమాలన్నీ మంచి విజయాలను సాధిస్తూ ముందుకు సాగుతూ ఉండడంతో ఇప్పుడు రాబోయే ఈ సినిమా మీద కూడా ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలైతే ఉన్నాయి. ఇక ఏది ఏమైనా కూడా బాలయ్య బాబు ఇప్పటికే వరుసగా మూడు సక్సెస్ లను అందుకొని ఉన్నాడు. కాబట్టి ఈ సినిమాతో నాలుగో సక్సెస్ కూడా సాధించడానికి సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తోంది…ఇక ఇదిలా ఉంటే ఈ సినిమాలో బాలయ్య డ్యూయల్ రోల్ లో నటిస్తున్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి.
ఇక ఇదిలా ఉంటే ఈ సినిమాలో బాబీ డియోల్ విలన్ గా నటిస్తున్న విషయం మనకు తెలిసిందే. ఇక ఇప్పుడు తెలుస్తున్న విషయం ప్రకారం ఈ సినిమాలో అసలు విలన్ బాబీ డియోల్ కాదని బాలయ్య ఇందులో డ్యూయల్ రోల్ లో నటిస్తున్నాడు. కాబట్టి బాలయ్య బాబు ఇటు హీరోగా, అటు విలన్ గా నటిస్తున్నాడనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. మరి ఏది ఏమైనా కూడా బాలయ్య విలనిజాన్ని చూపించడంలో సిద్దహస్తుడనే చెప్పాలి.
ఇక ఇంతకుముందు సుల్తాన్ అనే సినిమాలో ఆయన విలన్ గా నటించి మెప్పించాడు. ఆ సినిమా కమర్షియల్ గా పెద్దగా వర్కౌట్ కానప్పటికి విలనిజాన్ని పండించడంలో బాలయ్య బాబును మించిన వారు మరెవరు ఉండరు అనెంతలా తన నట విశ్వరూపాన్ని చూపించాడు.
మరి మరోసారి విలన్ పాత్రలో ఎలాంటి నటనను చూపిస్తాడు. తద్వారా ప్రేక్షకులను మెప్పిస్తాడా లేదా అనే విషయాలు కూడా తెలియాల్సి ఉన్నాయి…ఇక మొత్తానికైతే బాలయ్య బాబు ఈ సినిమా పూర్తయిన తర్వాత బోయపాటితో చేస్తున్న ‘అఖండ 2’ సినిమా కోసం తన డేట్స్ ను కేటాయించబోతున్నట్టుగా కూడా తెలుస్తోంది…