https://oktelugu.com/

Brahmanandam: నవ్వుల రారాజు బ్రహ్మానందంను నవ్వించే వ్యక్తి ఎవరో తెలుసా?

Brahmanandam: వెండితెరపై కమెడియన్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న కోట్లాది మంది ప్రేక్షకులను దక్కించుకున్న నవ్వుల రారాజు, కమెడియన్ బ్రహ్మానందం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈయన గత మూడున్నర దశాబ్దాల కాలం నుంచి విరామం లేకుండా ఇండస్ట్రీలో పని చేస్తూ విశేష ప్రేక్షకాదరణ దక్కించుకుని ఎన్నో పురస్కారాలను అవార్డులను అందుకున్నారు.అయితే ప్రస్తుతం వయసు పైబడటంతో తన శరీరానికి విశ్రాంతి అవసరమని భావించిన బ్రహ్మానందం సినిమాలను పూర్తిగా తగ్గించి ఇంటిపట్టునే తనకెంతో ఇష్టమైన ఆర్ట్ వేస్తూ […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : December 8, 2021 / 11:10 AM IST
    Follow us on

    Brahmanandam: వెండితెరపై కమెడియన్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న కోట్లాది మంది ప్రేక్షకులను దక్కించుకున్న నవ్వుల రారాజు, కమెడియన్ బ్రహ్మానందం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

    Bramhanandam

    ఈయన గత మూడున్నర దశాబ్దాల కాలం నుంచి విరామం లేకుండా ఇండస్ట్రీలో పని చేస్తూ విశేష ప్రేక్షకాదరణ దక్కించుకుని ఎన్నో పురస్కారాలను అవార్డులను అందుకున్నారు.అయితే ప్రస్తుతం వయసు పైబడటంతో తన శరీరానికి విశ్రాంతి అవసరమని భావించిన బ్రహ్మానందం సినిమాలను పూర్తిగా తగ్గించి ఇంటిపట్టునే తనకెంతో ఇష్టమైన ఆర్ట్ వేస్తూ తన కుటుంబ సభ్యులతో ఎంతో సంతోషంగా గడుపుతున్నారు.

    సుమారు 1250 చిత్రాలకుపైగా నటించిన ఇండస్ట్రీలో ఎన్నో రికార్డులు సృష్టించిన బ్రహ్మానందం సినిమాలో ఉన్నారంటే తప్పకుండా ప్రేక్షకులకు కావాల్సిన వినోదాన్ని పంచుతారు.ఇక ఎంతో మంది ప్రేక్షకులను నవ్వించే బ్రహ్మానందాన్ని నవ్వించే వ్యక్తి కూడా ఒకరున్నారు అనే విషయం మీకు తెలుసా? మరి ఈ నవ్వుల రారాజు నవ్వించే ఆ వ్యక్తి ఎవరు అనే విషయానికి వస్తే… బ్రహ్మానందం మనవడు పార్ధ. తన మనవడు తనను ఎంతగానో నవ్విస్తాడని ఓ సందర్భంలో బ్రహ్మానందం ఈ విషయాన్ని బయటపెట్టారు.

    Also Read: Pushpa: పరువుతో బన్నీ పోరాటం… అంత ఈజీ కాదు!

    తను ఏదైనా అంటే వెంటనే తన మనవడు నీకేం తెలియదు తాత నువ్వు ఊరుకో అంటాడని అది కాదు నాన్నా అని వివరించే ప్రయత్నం చేసిన రామకృష్ణ అంటూ తల బాదుకుంటాడని బ్రహ్మానందం తెలిపారు. తన మనవడు తన కుటుంబంలోకి వచ్చిన తర్వాత తన నవ్వుకు ఏ మాత్రం ఢోకా లేదని తన మనవడు తనను ఎంతో బాగా నవ్విస్తాడని ఈ సందర్భంగా బ్రహ్మానందం తన మనవడితో ఉన్న అనుబంధం గురించి తెలిపారు.

    Also Read: Pawan Kalyan: స్పందించని వకీల్ సాబ్.. సీఎం సాబ్ పై మంటే కారణమా !