Heroine Anitha: టాలీవుడ్ లో ఒకప్పటి స్టార్ డైరెక్టర్ తేజ ఎంతో మంది నటులను పరిచయం చేశారు. యూత్ ఐకాన్ గా కొంతకాలం కొనసాగిన తేజ ఆ తరువాత సినిమాలు తీయడం మానేశారు. తేజ డైరెక్షన్లో వచ్చిన కొన్ని సినిమాలు బ్లాక్ బస్టర్ గా నిలిచాయి. వాటిలో ‘నువ్వు నేను’ ఒకటి. లవ్ ఎంటర్టైన్మెంట్, కామెడీ, ఎమోషన్ ఇలా అన్నీ కలగలిపి ఉన్న ఈ మూవీ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇందులో హీరోయిన్ గా నటించిన అనిత ఆ కాలంలో ఫేవరేట్ హీరోయిన్ గా నిలిచింది. క్రమంగా ఆమె సినిమాల్లో తక్కువగా నటించి ప్రస్తుతం ఫ్యామిలీ లైఫ్ కే పరిమితం అయింది. ఇటీవల అనిత టీవీ షోల్లో బాగా కనిపిస్తోంది. ఈ సందర్భంగా అనిత భర్త గురించి హాట్ హాట్ గా చర్చించుకుంటున్నారు.
ముంబయ్ కి చెందిన అనిత అసలు పేరు నటాషా హస్సానందాని. సింధు కుటుంబానికి చెందిన ఈమె చదువు పూర్తయిన తరువాత టీవీ షో ఇదర్, ఉదర్ సీజన్ 2 ప్రోగ్రామ్ లో మొదటిసారిగా కనిపించింది. ఆమెను చూసి డైరెక్టర్ తేజ తన సినిమా ‘నువ్వు నేను’ కోసం ఎంపిక చేసి అవకాశం ఇచ్చారు. 2001లో రిలీజ్ అయిన ఈ మూవీతో అనిత తో పాటు ఉదయ్ కిరణ్ నటించారు. ఆ తరువాత తమిళంలో విక్రమ్ తో కలిసి ‘సమురాయ్’ అనే సినిమాలో కనిపించింది మళ్లీ తెలుగులో శ్రీరామ్, తొట్టిగ్యాంగ్, నేను పెళ్లికి రెడీ వంటి సినిమాల్లో నటించింది. అయితే సినిమాల్లో అవకాశాలు తగ్గాక అనిత టీవీ సీరియళ్లలో కనిపించడం ప్రారంభించింది.

2003లో ఆమె బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చి పలు హిందీ సీరియళ్లలో నటించింది. క్యుంకీ సాస్ బీ కబీ బహుథీ, తేరీ మేరీ లవ్ స్టోరీలు ఆమె నటించినవి పేరు తెచ్చుకున్నాయి. కొన్నాళ్లు ఇండస్ట్రీలో కొనసాగిన తరువాత 2013 అక్టోబర్ 14న గొవాలో వ్యాపారం చేస్తున్న రోహిత్ ను పెళ్లి చేసుకుంది. రోహిత్ వ్యాపారవేత్త మాత్రమే కాకుండా పలు టీవీ షోల్లో పాల్గొన్నాడు. 2019లో రోహిత్, అనిత కలిగి డ్యాన్స్ రియాలిటీ షో ‘నాచ్ బలియే’ సీజన్ 9 లో పాల్గొన్నారు. వీరు మొదటి రన్నరప్ గా నిలవడం విశేషం.
హస్సానందాని ప్రస్తుతం పూర్తిగా మారిపోయింది. ఈమె దంపతులకు ఓ కుమారుడు. వారి బాబుకు అరవ్ రెడ్డి అని పేరు పెట్టారు. వీరు ముగ్గురు కలిసి దిగి ఫొటోలు వైరల్ గా మారిపోతున్నాయి. అలాగే అనిత అప్పటికీ ఇప్పటికీ చెక్కు చెదరిన అందంతో అలాగే ఉన్నారు. దీంతో ఆమె ఫొటోలను చూసి రకరకాల కామెంట్లు పెడుతున్నారు.