Rashmika Mandanna: సినిమాల్లో కొన్ని జోడీలను చాలా ఇష్టపడుతుంటారు అభిమానులు. అలాంటి జోడీలు ఇండస్ట్రీలో ఎన్నో ఉన్నాయి. ఇదిలా ఉంటే హీరోయిన్ లకు హీరోలంటే.. హీరోలకు హీరోయిన్ లు అంటే కొందరిపై అభిమానం, ఇష్టం ఉంటుంది. కొందరిని చాలా అభిమానిస్తుంటారు. ఇష్టపడుతుంటారు. ఇప్పటికే ఇలాంటి విషయాలను కొందరు స్టార్లు వారి అభిమాన నటుల గురించి తెలియజేసిన విషయం తెలిసిందే. వారి నటనను కూడా ఎంతో అభిమానిస్తూ.. వారితో సినిమా చేయడానికి ఆసక్తి చూపిస్తుంటారు. మరి రష్మిక మందనకు ఎవరంటే ఇష్టమో తెలుసుకుందామా?
టాలీవుడ్ స్టార్ హీరోయిన్, నేషనల్ క్రష్ రష్మిక మందన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ అమ్మడు వరుస సినిమాల్లో నటిస్తూ దూసుకొని పోతుంది. అల్లు అర్జున్ తో పుష్ప సినిమాలో నటించి తన రేంజ్ ను పెంచుకుంది. అంతే కాదు ఈ సినిమాకు సీక్వెల్ లో కూడా రష్మిక నే కనిపించనుంది. ఒకవైపు సినిమాల్లో నటిస్తూనే మరోవైపు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది. ఇక కమర్షియల్ యాడ్స్ లో నటిస్తూ భారీగా సంపాదిస్తోంది ఈ నేషనల్ క్రష్. రీసెంట్ గా యానిమల్ సినిమాతో ప్రేక్షకులను పలకరించి భారీ హిట్ ను సొంతం చేసుకుంది.
తెలుగులో మాత్రమే కాదు ఇతర భాషల్లో కూడా తన లక్ ను పరీక్షించుకొని సత్తా చాటింది అమ్మడు. వరుస అవకాశాలను అందుకుంటూ దూసుకుపోతోంది. ఇదిలా ఉంటే తాజాగా సోషల్ మీడియాలో రష్మిక మందన కు సంబంధించిన ఓ వార్త నెట్టింట వైరల్ గా మారింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రష్మిక ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. ఆమెకు ఏ హీరో అంటే ఇష్టమో తెలిపింది. అంతే కాదు తనతో నటించాలని చాలా ఉందని తన మనుసులో మాటను కూడా తెలియజేసింది. ఇంతకీ ఎవరు అనుకుంటున్నారా?
జూ. ఎన్టీఆర్ అంటే తనకు ఇష్టమని.. ఈయనతో నటించాలని చాలా కోరికగా ఉందని తెలిపింది రష్మిక. తారక్ నటన, డాన్స్ అంటే చచ్చిపోతానని తెలిపింది. మరి ఎన్టీఆర్ తదుపరి సినిమాలో అయినా దర్శక నిర్మాతలు ఈ ముద్దుగుమ్మకు అవకాశం ఇస్తారో లేదో చూడాలి. కొందరు ఈ జోడీ బాగుంటుందని అంటున్నారు. మరి అమ్మడు కోరిక ఎప్పుడు నిరవేరుతుందో చూడాలి. అయితే ఈ అమ్మడు పుష్ప 2 సినిమాతో త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు.