Pawan Kalyan : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇండస్ట్రీ కి వచ్చిన మొదట్లోనే పరుసగా ఏడు సక్సెస్ లను కొట్టి ఎవరికి సాధ్యం కాని విధం గా వరుస సక్సెస్ లను అందుకున్నాడు. ఇక ఆ తర్వాత 10 సంవత్సరాల వరకు కూడా తనకు ఒక్క సక్సెస్ రాకపోయిన కూడా ఇండస్ట్రీలో ఆయన క్రేజ్ పెరిగిందే కానీ అసలు తగ్గలేదు. ఇక దీంతో ఆయన హీరోగా తనకంటూ ఒక సపరేట్ ఇమేజ్ ను అయితే ఏర్పాటు చేసుకున్నాడు.
ఇక ఇదే క్రమంలో ఆయన చేసిన చాలా సినిమాలు డిజాస్టర్లు అయినప్పటికీ మళ్లీ గబ్బర్ సింగ్ సినిమాతో బాక్సాఫీస్ రికార్డులను షేక్ చేశాడు. ఇక ఇలాంటి పవన్ కళ్యాణ్ కెరియర్ లో ఇప్పటివరకు రేణు దేశాయ్ ని, శృతిహాసన్ ని మినహాయిస్తే తన సినిమాల్లో ఏ హీరోయిన్ ను కూడా రిపీట్ చేయలేదు. ఇక శృతిహాసన్ అయితే ఆయనకు చాలా బాగా కలిసి వచ్చిందనే చెప్పాలి. మిగతా హీరోల సినిమాలన్నింటికి ఆమెని ఐరన్ లెగ్ గా చెప్పుకునే వాళ్లు కానీ పవన్ కళ్యాణ్ సినిమాల్లో మాత్రం ఆమె గోల్డెన్ లెగ్ గా మంచి పేరు సంపాదించుకున్నారు.
పవన్ కళ్యాణ్ తో చేసిన గబ్బర్ సింగ్, కాటమరాయుడు, వకీల్ సాబ్ లాంటి సినిమాలు మంచి విజయాలను అందుకున్నాయి. ఇక దాంతో ఆమె పవన్ కళ్యాణ్ కి బాగా కలిసి వచ్చిన హీరోయిన్ గా చెప్పుకుంటూ ఉంటారు. ఇక ఇలాంటి క్రమంలో ఇంక ముందు రాబోయే పవన్ కళ్యాణ్ సినిమాల్లో తను హీరోయిన్ గా చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇక ఇప్పటివరకు ఎవరిని కూడా రిపీటెడ్ గా తన సినిమాల్లోకి తీసుకొని పవన్ కళ్యాణ్ శృతి హాసన్ ని మాత్రం తన సినిమాల్లో హీరోయిన్ గా తీసుకోవడానికి ముఖ్య కారణం ఏంటి అంటే వాళ్లిద్దరి మధ్య ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అవుతుంది.
అందుకే ఆయా సినిమాల డైరెక్టర్లు గాని, అలాగే పవన్ కళ్యాణ్ అభిమానులు గానీ పవన్ కళ్యాణ్ సినిమాల్లో హీరోయిన్ గా శృతిహాసన్ ను పెట్టుకోవాలని ఎక్కువగా సజెస్ట్ చేస్తూ ఉంటారు. కాబట్టి వాళ్ల ఇంట్రెస్ట్ ని కాదనలేక పవన్ కళ్యాణ్ కూడా తన సినిమాల్లో ఆమెనే రిపీటెడ్ గా పెడుతూ వచ్చాడు. ఇక ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్ లో బిజీ గా ఉండడంవల్ల కొన్ని రోజులు షూటింగ్ కి బ్రేక్ ఇచ్చాడు. ఈ బ్రేక్ తర్వాత మళ్లీ తను షూటింగ్ లో పాల్గొంటాడు…