India’s Number One Hero : సినిమా యూనివర్సల్ అయ్యింది. భాషా బేధాలు చెరిగిపోయాయి. మంచి సినిమాకు సౌత్ నార్త్ అనే తేడా లేకుండా ఆదరణ దక్కుతుంది. ఈ క్రమంలో ప్రాంతీయ భాషల హీరోలకు ఇండియా వైడ్ మార్కెట్ ఏర్పడింది. తెలుగు, తమిళ, కన్నడ హీరోలకు నార్త్ లో అభిమానులు ఉంటున్నారు. బాహుబలితో ప్రభాస్, కెజిఎఫ్ తో యష్, పుష్ప మూవీతో అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్స్ అయ్యారు. ఆర్ ఆర్ ఆర్ చిత్రంతో పాన్ ఇండియా లీగ్ లో ఎన్టీఆర్, రామ్ చరణ్ చేరారు.
గతంలో బాలీవుడ్ నెంబర్ వన్ ఇండస్ట్రీగా ఉండేది. అక్కడే భారీ చిత్రాలు తెరకెక్కేవి. హిందీ జాతీయ భాష కావడంతో నార్త్ ఇండియా మొత్తం ఆ చిత్రాలకు మార్కెట్ ఉండేది. సౌత్ లో కూడా ఒక సెక్షన్ ఆడియన్స్ హిందీ చిత్రాలు చూస్తారు. పాన్ ఇండియా కాన్సెప్ట్ వచ్చాక బాలీవుడ్ వెనుకబడిపోయింది. బాలీవుడ్ స్టార్స్ టాప్ లీగ్ నుండి తప్పుకోవాల్సిన పరిస్థితి. ఇండియాలో నెంబర్ హీరోగా సౌత్ స్టార్ అవతరించడం ఊహించని పరిణామం.
బాలీవుడ్ కి చెందిన ఆర్మాక్స్ మీడియా సంస్థ ప్రతినెలా ఎంటర్టైన్మెంట్ రంగాలకు చెందిన సర్వేలు చేస్తుంది. జూన్ నెలకు గానూ నిర్వహించిన సర్వేలో అనూహ్య ఫలితాలు వచ్చాయి. దేశవ్యాప్తంగా ఉన్న ఆడియన్స్ అభిప్రాయం ఆధారంగా… కోలీవుడ్ హీరో విజయ్ దేశంలోనే నెంబర్ వన్ హీరోగా ఉన్నారు. చాలా నెలలుగా విజయ్ ఫస్ట్ ర్యాంక్ లో కొనసాగుతున్నారు. రెండో స్థానం షారుక్ ఖాన్ కి దక్కింది. గతంలో షారుక్ టాప్ టెన్ లో లేరు. పఠాన్ విజయంతో ఆయన క్రేజ్ పెరిగింది. దాంతో ప్రభాస్ మూడో స్థానానికి పడిపోయాడు.
గతంలో ఆయనది రెండో ర్యాంక్. అల్లు అర్జున్ కి నాలుగో స్థానం దక్కింది. ఆర్ ఆర్ ఆర్ స్టార్ ఎన్టీఆర్ ఐదో స్థానంలో కొనసాగుతున్నారు. వీరు టాప్ ఫైవ్. ఆరో స్థానం మరో కోలీవుడ్ స్టార్ అజిత్ కి దక్కింది. ఏడో స్థానంలో సల్మాన్ ఖాన్ కొనసాగుతున్నారు. గతంలో టాప్ ఫైవ్ లో ఉన్న రామ్ చరణ్ ఎనిమిదో స్థానానికి పడిపోయాడు. అక్షయ్ కుమార్ కి తొమ్మిదో స్థానం దక్కగా… మహేష్ అనూహ్యంగా టాప్ టెన్ లో చోటు దక్కించుకున్నాడు. కన్నడ స్టార్ యష్ కి టాప్ టెన్ లో చోటు దక్కలేదు. ఒక్క పాన్ ఇండియా హిట్ లేకున్నా విజయ్ దేశంలోనే నెంబర్ వన్ హీరోగా సత్తా చాటుతున్నాడు.
Ormax Stars India Loves: Most popular male film stars in India (Jun 2023) #OrmaxSIL pic.twitter.com/I0e35kOGBm
— Ormax Media (@OrmaxMedia) July 21, 2023