Naresh Pavitra Lokesh : చిత్ర పరిశ్రమలో పుట్టి పెరిగిన నరేష్ చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ మొదలుపెట్టాడు. విజయనిర్మల మొదటి భర్త సంతానమే నరేష్. విజయనిర్మల కృష్ణను వివాహం చేసుకున్నాక ఆయన వద్దే పెరిగాడు. 1982లో విడుదలైన ‘నాలుగు స్తంభాలాట’ మూవీతో హీరోగా మారారు. దర్శకుడు జంధ్యాల తెరకెక్కించిన ఈ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ సూపర్ హిట్. రెండు జళ్ళ సీత, శ్రీవారికి ప్రేమలేఖ వంటి హిట్ చిత్రాల్లో నటించారు. కామెడీ చిత్రాల హీరోగా ఏడాదికి పది చిత్రాలు చేసేవారు. 90లలో నరేష్ టైర్ టూ హీరోగా మార్కెట్ సంపాదించారు.

1993లో విడుదలైన జంబలకడిపంబ నరేష్ కెరీర్లో అతిపెద్ద హిట్. దర్శకుడు ఇవివి సత్యనారాయణ దర్శకత్వంలో ఆ మూవీ తెరకెక్కింది. ఆయన దర్శకత్వంలో నరేష్ చేసిన మరో హిట్ మూవీ ఆమె. ఈ లేడీ ఓరియెంటెడ్ మూవీలో మరో హీరోగా శ్రీకాంత్ నటించారు. 2002 నుండి ఆయన క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశారు. ప్రస్తుతం ఆయన మోస్ట్ వాంటెడ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్. ఏడాదికి డజను చిత్రాల వరకూ చేస్తున్నారు.
నటుడిగా ఆయనది సక్సెస్ ఫుల్ లైఫ్. వ్యక్తిగత జీవితం మాత్రం సవ్యంగా సాగలేదు. ముగ్గురు భార్యలతో నరేష్ విడిపోయాడు. వారి వివరాలు పరిశీలిస్తే… సినిమాటోగ్రాఫర్ శ్రీను కుమార్తెతో నరేష్ కి మొదటి వివాహం జరిగింది. వీరికి ఒక అబ్బాయి. అతని పేరు నవీన్ విజయ్ కృష్ణ. అతడు హీరోగా కూడా ఎంట్రీ ఇచ్చాడు. మొదటి భార్యతో విడిపోయిన నరేష్ రెండో వివాహం… ప్రముఖ రచయిత దేవులపల్లి కృష్ణశాస్త్రి మనవరాలు రేఖ సుప్రియను పెళ్లి చేసుకున్నారు. ఆమెతో కొన్నాళ్ళు కాపురం చేసిన నరేష్ విడాకులు ఇచ్చారు. రెండవ భార్యతో కూడా కూడా ఒక అబ్బాయి ఉన్నాడు.

ఇక మూడో వివాహంగా కాంగ్రెస్ సీనియర్ పొలిటీషియన్ రఘువీరారెడ్డి తమ్ముడు కుమార్తె రమ్య రఘుపతిని చేసుకున్నారు. కొన్నాళ్ళు రమ్య రఘుపతితో నరేష్ కలిసి కాపురం చేశారు. కారణం తెలియదు కానీ ఆమెకు కూడా గుడ్ బై చెప్పేశాడు. ఐదారేళ్ళ క్రితమే రమ్యతో ఆయన బంధం ముగిసింది. రమ్య రఘుపతి-నరేష్ లకు ఒక సంతానం. నరేష్ నాకు విడాకులు ఇవ్వలేదని రమ్య ఆరోపిస్తున్నారు. తాజాగా నటి పవిత్ర లోకేష్ ని వివాహం చేసుకోబోతున్నట్లు నరేష్ ప్రకటించారు. రమ్య రఘుపతి దూరం అయ్యాక, నరేష్ పవిత్ర లోకేష్ తో సహజీవనం చేస్తున్నాడు.