Chandra Mohan: ఆయన హ్యాండ్ పడితే … చంద్రమోహన్ తో ఎంట్రీ ఇచ్చి దేశాన్ని ఊపేసిన స్టార్ హీరోయిన్స్ ఎవరో తెలుసా?

హీరోగా నటిస్తూనే స్టార్ హీరోల చిత్రాల్లో ఆయన సపోర్టింగ్ రోల్స్ చేసేవారు. చంద్రమోహన్ కెరీర్లో 170కి పైగా చిత్రాల్లో హీరోగా నటించారు. పదుల సంఖ్యలో హీరోయిన్స్ ని వెండితెరకు పరిచయం చేశారు. చంద్రమోహన్ అంటే హీరోయిన్స్ కి లక్కీ సెంటిమెంట్.

Written By: NARESH, Updated On : November 11, 2023 12:27 pm

Chandra Mohan

Follow us on

Chandra Mohan: చంద్రమోహన్ పరిపూర్ణ నటుడిగా పేరు తెచ్చుకున్నారు. 23 ఏళ్ల వయసులో హీరోగా ఆయన వెండితెరకు పరిచయం అయ్యారు. దిగ్గజ దర్శక నిర్మాత బిఎన్ రెడ్డి రంగులరాట్నం చిత్రంతో ఆయన్ని హీరో చేశారు. రంగులరాట్నం మంచి విజయం సాధించింది. నటనలో, అందంలో చంద్రమోహన్ కి తిరుగులేదు. అయితే ఆయన పొట్టిగా ఉండేవారు. దీని వలన కమర్షియల్ హీరోగా ఎదగలేకపోయారు. అయితే చంద్రమోహన్ కామెడీ, ఫ్యామిలీ, రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ చేసి సక్సెస్ అయ్యారు.

ఇకవైపు హీరోగా నటిస్తూనే స్టార్ హీరోల చిత్రాల్లో ఆయన సపోర్టింగ్ రోల్స్ చేసేవారు. చంద్రమోహన్ కెరీర్లో 170కి పైగా చిత్రాల్లో హీరోగా నటించారు. పదుల సంఖ్యలో హీరోయిన్స్ ని వెండితెరకు పరిచయం చేశారు. చంద్రమోహన్ అంటే హీరోయిన్స్ కి లక్కీ సెంటిమెంట్. ఆయనతో నటించినవారు, హీరోయిన్స్ గా పరిచయమైన వారు దేశాన్ని ఏలారు. వాణిశ్రీ, శ్రీదేవి, జయప్రద, జయసుధ, విజయశాంతి ఆయన చేయి పడ్డాక ఎక్కడికో వెళ్లిపోయారు.

చంద్రమోహన్ మొదటి చిత్రం రంగులరాట్నం లో వాణిశ్రీ హీరోయిన్ గా నటించింది. అప్పటి వరకు ఆమె సిస్టర్ రోల్స్ తో పాటు సపోర్టింగ్ రోల్స్ చేసుకుంటుంది. రంగుల రాట్నం తర్వాత ఆమె స్టార్ హీరోయిన్ అయిపోయింది. ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, శోభన్ బాబులతో వాణిశ్రీ బ్లాక్ బస్టర్ చిత్రాల్లో నటించింది. జయప్రదకు సిరి సిరి మువ్వలు చిత్రం వరకు ఫేమ్, ఇమేజ్ లేదు. దర్శకుడు కే విశ్వనాథ్ చంద్రమోహన్-జయప్రద హీరో హీరోయిన్స్ సిరిసిరి మువ్వలు మూవీ చేశారు.

అనంతరం జయప్రద టాలీవుడ్ కమర్షియల్ హీరోయిన్ గా ఎదిగింది. బాలీవుడ్ లో కూడా చిత్రాలు చేసింది. ప్రాధాన్యత లేని పాత్రలు చేస్తున్న జయసుధకు బ్రేక్ ఇచ్చిన మూవీ ప్రాణం ఖరీదు. ఈ చిత్రంలో చంద్రమోహన్-జయసుధ జంటగా నటించారు. అనంతరం ఆమె స్టార్ హీరోయిన్ అయ్యారు. జయసుధ-చంద్రమోహన్ కాంబోలో 25 సినిమాలు వచ్చాయి. విజయశాంతి కూడా మొదట్లో సిస్టర్, సపోర్టింగ్ రోల్స్ చేసింది. చంద్రమోహన్ కి జంటగా పెళ్లి చూపులు చిత్రంలో నటించింది. ఆ సినిమా తర్వాత విజయశాంతి లేడీ సూపర్ స్టార్ అయ్యింది. వీరి కాంబోలో 8 చిత్రాలు వచ్చాయి.