Tollywood Movies: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక సంవత్సరంలో చాలా సినిమాలు రిలీజ్ అవుతూ ప్రేక్షకులను విపరీతంగా అలరిస్తూ ఉంటాయి. అందులో కొన్ని సినిమాలు హిట్ అవుతుంటే చాలా సినిమాలు ఫ్లాప్ అవుతూ ఉంటాయి. అయితే ఒకే కాన్సెప్ట్ తో ఇండస్ట్రీ లో చాలా సినిమాలు వస్తుంటాయి. ఇలా ఇండస్ట్రీలో ఒకే కాన్సెప్ట్ తో వచ్చిన సినిమాలు ఏవేవి ఉన్నాయో ఒకసారి మనం తెలుసుకుందాం…
సుభాష్ చంద్రబోస్, హనుమంతు…
వెంకటేష్ హీరోగా కే రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన సినిమా సుభాష్ చంద్రబోస్…ఈ సినిమా దేశభక్తి నేపథ్యంలో స్వాతంత్ర్య పోరాటం కోసం సాగించిన ఉద్యమం నాటి స్ర్ముతులను గుర్తు చేస్తూ సాగే సినిమా ఈ సినిమా ఫిక్షన్ స్టోరీ అయినప్పటికీ రాఘవేంద్రరావు సుభాష్ చంద్రబోస్ అనే ఒక క్యారెక్టర్ స్వాతంత్ర్య ఉద్యమంలో ఎలా పాల్గొన్నాడు అనే కథాంశంతో తెరకెక్కించాడు. అయితే ఈ సినిమాలో వెంకటేష్ సుభాష్ చంద్రబోస్ క్యారెక్టర్ లో నటించి తనదైన పాత్రలో మెప్పించాడు. అయితే ఇందులో ఇద్దరు వెంకటేష్ లు ఉంటారు. ఒక వెంకటేష్ చనిపోతే మరో వెంకటేష్ తను మిగిల్చిన ఆశయాన్ని పూర్తి చేస్తాడు.
ఇక ఇది పక్కన పెడితే చంద్ర మహేష్ డైరెక్షన్ లో శ్రీహరి హీరోగా వచ్చిన హనుమంతు సినిమా కూడా ఇదే కాన్సెప్ట్ తో తెరకెక్కింది. దీంట్లో కూడా ఇద్దరూ శ్రీహరిలు ఉంటారు. ఒక శ్రీహరి చనిపోగా మరో శ్రీహరి తను మిగిల్చిన ఆశయాన్ని పూర్తి చేస్తాడు.అయితే ఈ రెండు సినిమాలు కూడా ఒకే రకమైన కాన్సెప్ట్ తో వచ్చి అప్పట్లో సందడి చేశాయి. అయితే విశేషమేంటంటే రెండు సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద భారీ డిజాస్టర్లుగా మిగిలాయి…
రెబల్, రామయ్యా వస్తావయ్యా…
లారెన్స్ డైరెక్షన్ లో ప్రభాస్ హీరోగా వచ్చిన రెబల్ సినిమా అత్యంత భారీ అంచనాలతో తో వచ్చి భారీ డిజాస్టర్ గా మిగిలింది. అయితే ఈ సినిమాలో లారెన్స్ డైరెక్షన్, కథ ఏమాత్రం బాగుండక పోవడంతో ఈ సినిమా భారీ డిజాస్టర్ అయింది.ఈ సినిమాలో తన లవర్ ని చంపిన వ్యక్తి మీద రివెంజ్ తీర్చుకోవడమే ఈ సినిమా స్టోరీ…
ఇక హరీష్ శంకర్ డైరెక్షన్ లో జూనియర్ ఎన్టీఆర్ హీరో వచ్చిన రామయ్య వస్తావయ్య సినిమా కూడా ఇదే కాన్సెప్ట్తో రావడం అలాగే రెండు సినిమాలు కూడా ఒకే జానర్ కి సంబంధించి ఒకే రకంగా ఉండడం చూసిన అభిమానులకి రెండు సినిమాలు కూడా సిమిలర్ గా ఉన్నాయి అని చెప్పి అప్పట్లో రెండు సినిమాల మీద కూడా చాలా పెద్ద చర్చలు జరిగాయి. అయితే ఈ రెండు సినిమాలు కూడా డిజాస్టర్లు గా మిగలడం విశేషం…
ఇలా ఇవి అనే కాకుండా ఇంకా చాలా సినిమాలు కూడా ఒకే కాన్సెప్ట్ తెరకెక్కి కొన్ని విజయం సాధిస్తే మరికొన్ని ప్లాపులుగా నిలిచాయి..