Mahesh Babu: సూపర్ స్టార్ కృష్ణ(Superstar Krishna) నట వారసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన మహేష్ బాబు మొదటి సినిమాగా చేసిన రాజకుమారుడు సినిమాతోనే హీరో గా తనని తాను ఎస్టాబ్లిష్ చేసుకున్నాడు. ఇక ఈ సినిమా ఇచ్చిన ఉత్సాహంతో వరుసగా మంచి సినిమాలను చేస్తూ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా గుర్తింపుని సంపాదించుకున్నాడు. ఇక చాలా తక్కువ సమయంలోనే తండ్రికి తగ్గ తనయుడుగా పేరు తెచ్చుకోవడమే కాకుండా పోకిరి సినిమాతో మొదటి ఇండస్ట్రీ హిట్ ను కూడా కొట్టాడు.
ఇక ఇలాంటి మహేష్ బాబు ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో పాన్ వరల్డ్ లో ఒక సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తొందర్లోనే సెట్స్ మీదికి వెళ్లే అవకాశాలైతే ఉన్నాయి. దీంతో భారీ రికార్డులను కూడా బ్రేక్ చేసే ఆలోచనలో రాజమౌళి మహేష్ బాబు లు ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక ఇదిలా ఉంటే ఒకప్పుడు తొలిప్రేమ సినిమాతో పవన్ కళ్యాణ్ కి సూపర్ డూపర్ సక్సెస్ ని అందించిన కరుణాకరన్ ఆ తర్వాత చాలా మంది హీరోలతో వరుస సినిమాలు చేస్తూ మంచి విజయాలను అందుకున్నాడు. ఇక ఇలాంటి క్రమంలోనే కరుణాకరన్ మహేష్ బాబుతో ఒక సినిమా చేయాలని ప్లాన్ చేశాడు. అయినప్పటికీ అది వర్కౌట్ కాలేదు.
ఇక దాంతో ఆయన సుమంత్ ని హీరోగా పెట్టి యువకుడు అనే సినిమా చేశాడు. ఈ సినిమా మంచి హిట్ అయింది. అయితే మొదటగా ఈ సినిమాని మహేష్ బాబుతో చేయాలని అనుకున్నాడు. కానీ ఈ సినిమా మీద మహేష్ బాబు పెద్దగా ఇంట్రెస్ట్ చూపించకపోవడంతో ఆయన సుమంత్ తో చేసి మంచి సక్సెస్ ని అందుకున్నాడు. ఇక ఆ తర్వాత కరుణాకరన్ ప్రభాస్ తో కూడా డార్లింగ్ అనే సినిమా చేసి సూపర్ హిట్ కొట్టాడు.
ఇక యువకుడు సినిమా మహేష్ బాబు కరుణాకరన్ కాంబినేషన్ లో పడుంటే మాత్రం ఆ సినిమా ఇంకా మంచి విజయం సాధించి ఉండేదని పలువురు ట్రేడ్ పండితులు సైతం ఇప్పటికీ వాళ్ల అభిప్రాయాన్ని తెలియజేస్తుంటారు…