Tollywood Top Hero: ప్రస్తుతం స్టార్ హీరోలందరు పాన్ ఇండియా బాట పడుతున్నారు. ఇప్పటికే ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో నెంబర్ వన్ హీరో ఎవరు అనే దానిమీద విపరీతమైన పోటీ అయితే నడుస్తోంది. బాలీవుడ్ హీరోలు ఎప్పటికప్పుడు వాళ్ళ సినిమాలను చేస్తూ ముందుకు సాగే ప్రయత్నం చేస్తున్నప్పటికి వాళ్లకు సరైన సక్సెస్ అయితే రావడం లేదు. ఇక తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న హీరోల మీదనే అందరి చూపు ఉంది. వాళ్ళు మాత్రమే ఇండియన్ సినిమా ఇండస్ట్రీని శాసించే స్థాయికి వెళ్ళగలరు. అలాగే వాళ్లతో సినిమాలు చేస్తేనే సినిమాలు సూపర్ డూపర్ సక్సెస్ లను సాధిస్తాయి అంటూ దర్శక నిర్మాతలు సైతం వాళ్ల వెంట పడుతున్నారు. మరి తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న ఎవరికి వారు వివిధ స్ట్రాటజీలను వాడుతూ ముందుకు దూసుకెళ్తుండటం విశేషం… ప్రస్తుతం ప్రభాస్ భారీ సినిమాలను చేస్తూ ముందుకు సాగుతున్నాడు. ఇక ఆయన వేరే డివిషన్స్ ఏమీ లేకుండా మాస్ సినిమాలను మాత్రమే చేయాలనే సంకల్పంతో ఉన్నాడు. ఇక రాబోయే సినిమాలతో సక్సెస్ లను దక్కించుకోవాలనే ప్రయత్నంలో ఉన్నాడు…
Also Read: బీరు తాగుదామని.. మూత తెరిచాడు.. షాకింగ్ వీడియో
మహేష్ బాబు సైతం రాజమౌళితో చేస్తున్న సినిమాతో 3000 కోట్లకు పైన కలెక్షన్స్ ను అందుకొని ఇండియాలో నెంబర్ వన్ హీరోగా ఎదగాలనే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తోంది…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫుల్ టైం పాలిటిక్స్ లోకి వెళ్లిపోయాడు. కాబట్టి అడపదడప సినిమాలను చేస్తాడు తప్ప రెగ్యులర్ గా సినిమాలను చేయలేడు. అందుకే ఆయనను ఈ లిస్టులోకి ఆయన్ని మనం తీసుకోకపోవడమే బెటర్
రామ్ చరణ్ లాంటి నటుడు సైతం ‘త్రిబుల్ ఆర్’ సినిమాతో 1200 కోట్ల కలెక్షన్లను కొల్లగొట్టాడు. మరి రాబోతున్న పెద్ది సినిమాతో 1500 కోట్లకు పైన కలెక్షన్లు రాబట్టడమే కాకుండా వీలైతే ఇండస్ట్రీలో ఉన్న అన్ని రికార్డులను బ్రేక్ చేయాలనే దృఢ సంకల్పంతో ఉన్నాడు…
ఎన్టీఆర్ సైతం దేవర సినిమాతో 500 కోట్ల కలెక్షన్స్ ను కొల్లగొట్టాడు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వస్తున్న సినిమాకు 2000 కోట్లకు పైన కలెక్షన్లు రాబడతానని అలాగే ఇండస్ట్రీలో ఉన్న అన్ని రికార్డులను బ్రేక్ చేయడమే కాకుండా ఇండస్ట్రీ హిట్ ను కూడా నమోదు చేస్తానని చాలా కాన్ఫిడెంట్ ని వ్యక్తం చేస్తున్నాడు…
అల్లు అర్జున్ సైతం పుష్ప 2 సినిమాతో 1850 కోట్లకు పైన కలెక్షన్లు రాబట్టి ‘బాహుబలి 2’ సినిమా రికార్డును బ్రేక్ చేసినప్పటికి ఆయన రాబోతున్న సినిమాలు మరింత విజయాలను అందుకొని నెంబర్ వన్ పొజిషన్ ను దక్కించుకోవడమే లక్ష్యంగా పెట్టుకొని బరిలోకి దిగుతున్నాడు…
వీళ్ళందరిలో ఎవరు నెంబర్ వన్ పొజిషన్ ను అందుకుంటారు అనేది తెలియాలంటే మాత్రం ఇక మీదట రాబోతున్న సినిమాలను బట్టే డిసైడ్ అది అవుతుందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు…