Senior Heroes: ఒకప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న టాప్ హీరోలందరు 100 కోట్ల మార్కును దాటుతూ ముందుకు దూసుకెళ్లేవారు. తెలుగు సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చే సినిమాలను అసలు పట్టించుకునేవారు కాదు. కారణమేంటంటే మన దగ్గర వచ్చే కంటెంట్లలో పెద్దగా కొత్తదనం ఉండదని, రొటీన్ రెగ్యూలర్ ఫార్మాట్లో సినిమాలు చేస్తారని 5 ఫైట్లు, 6 పాటలతో సినిమాలు ముగించేస్తారు అంటూ కామెంట్లు చేస్తుండేవారు… కానీ ఎప్పుడైతే బాహుబలి సినిమా వచ్చిందో అప్పటి నుంచి తెలుగు సినిమా అంటే ఏంటో అందరికీ తెలిసిపోయింది. టోటల్ ఇండియాలోనే తెలుగు సినిమా ఇండస్ట్రీ స్థాయి టాప్ పొజిషన్ కి వెళ్ళిపోయింది. ఇక ఇప్పుడు తెలుగు సినిమా వస్తుందంటే చాలు ప్రతి ఒక్కరు ఆ సినిమా కోసం అటెన్షన్ తో ఎదురుచూసే రోజులైతే వచ్చేసాయి. ఇలాంటి క్రమంలోనే యంగ్ హీరోలు స్టార్ హీరోలందరు భారీ వసూళ్లను కొల్లగొడుతూ ముందుకు దూసుకెళ్తుంటే సీనియర్ హీరోలు మాత్రం పాన్ ఇండియా సినిమాలను చేయడానికి కొంతవరకు తడబడుతున్నారు. ఒకవేళ సినిమా చేసిన కూడా అవి పెద్దగా సక్సెసులైతే సాధించడం లేదు…
చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్ లాంటి సీనియర్ హీరోలు ఇప్పటికే 100 కోట్ల మార్కును దాటారు. నాగార్జున మాత్రం 100 కోట్ల మార్కును ఇంకా దాటలేకపోతున్నాడు. కారణమేంటి అంటే రీసెంట్గా ఆయన చేసిన సినిమాలేవి కూడా ప్రేక్షకులను అలరించడం లేదు. దాంతో తమిళ్ డైరెక్టర్ అయిన కార్తీక్ డైరెక్షన్ లో తన వందో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతో ఎలాంటి గుర్తింపును సంపాదించుకుంటాడు.
తద్వారా ఆయనకంటూ ఎలాంటి ఐడెంటిటి క్రియేట్ అవుతుంది అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. నాగార్జున ఒక్కడే ఈ రేసులో వెనుకబడిపోయాడు. ఇంతకుముందు వెంకటేష్ కూడా ఈ రేసులో కొద్దిగా వెనుకబడినట్లు కనిపించినప్పటికి ఈ సంవత్సరం సంక్రాంతి కానుకగా వచ్చిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాతో 300 కోట్లు మార్కును దాటిన హీరోగా అతను గొప్ప గుర్తింపును సంపాదించుకున్నాడు… ‘డాకూ మహారాజు’ సినిమాతో 150 కోట్ల కలెక్షన్స్ కొల్లగొట్టిన బాలయ్య 100 కోట్ల మార్కును దాటిన హీరోగా పేరు తెచ్చుకున్నాడు.
చిరంజీవి సైతం ‘వాల్తేరు వీరయ్య’ సినిమాతో 200 కోట్ల కలెక్షన్స్ ను కొల్లగొట్టాడు…ప్రస్తుతం సీనియర్ హీరోల్లో నాగార్జున ఒక్కడే ఈ ఫీట్ అయితే అందుకోలేకపోయాడు. ఇక రాబోయే సినిమాలతో ఆయన కూడా 100 కోట్ల క్లబ్లో చేరిపోతాడా? లేదా అనేది తెలియాలంటే మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…