Pulivendula By Election: జగన్( Y S Jagan Mohan Reddy) రాజీనామా చేస్తారా? పులివెందుల శాసనసభ సభ్యత్వాన్ని వదులుకుంటారా? ప్రతిపక్ష హోదా ఇవ్వనందుకు నిరసనగా ఈ చర్యకు దిగుతారా? తద్వారా ఉప ఎన్నికల్లో గెలిచి కూటమి ప్రభుత్వంపై వ్యతిరేకత ఉందని నిరూపిస్తారా? ఇప్పుడు పొలిటికల్ సర్కిల్లో ఇదే చర్చ నడుస్తోంది. తెలంగాణలో జగన్మోహన్ రెడ్డికి కెసిఆర్ ఆత్మీయ మిత్రుడు. ఇప్పుడు ఆయన పార్టీ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో గట్టిగానే తలపడుతోంది. అధికార కాంగ్రెస్ పార్టీతో నువ్వా నేనా అన్నట్టు ఫైట్ చేస్తోంది. సగం పార్లమెంట్ సగం పార్లమెంట్ స్థానాల్లో డిపాజిట్లు కోల్పోయింది కేసీఆర్ పార్టీ. అటువంటి పార్టీకి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు టానిక్ లా పనిచేసాయి. అందుకే ఏపీలో బలపడాలనుకుంటున్న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సైతం అటువంటి ఉప ఎన్నికను కోరుకుంటుంది.
* వైసిపికి ఉప ఎన్నికలే బలం..
వాస్తవానికి వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress ) పార్టీ ఉప ఎన్నికల తోనే రాజకీయ ప్రయోజనం పొందింది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని ఏర్పాటు చేసినప్పుడు జగన్మోహన్ రెడ్డికి అండగా దాదాపు 15 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాజీనామాలు చేశారు. అప్పట్లో కేంద్రంతో పాటు రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉంది. అయినా సరే ఉప ఎన్నికల్లో సత్తా చాటింది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ. 2024 వరకు ఆ పార్టీకి తిరుగులేని పునాదులు వేసి ఆ ఉప ఎన్నికలు. ఇప్పుడు కూడా అటువంటి ఆలోచన చేస్తే తప్పకుండా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ప్లస్ అవుతుందని సలహాదారులు సూచిస్తున్నారు. కానీ అంత సాహసం జగన్మోహన్ రెడ్డి చేస్తారా? అన్నది అనుమానమే. టిడిపి హయాంలో జరిగిన నంద్యాల ఉప ఎన్నిక.. వైసిపి హయాంలో జరిగిన ఉప ఎన్నికలు గురించి జగన్మోహన్ రెడ్డికి తెలియంది కాదు. అధికార పార్టీని ఢీకొట్టి వెళ్లాలంటే అంత ఈజీ కాదు. పైగా కేంద్రం సంపూర్ణ సహకారం ఉంది.
* ఆ రెండు నియోజకవర్గాల్లో..
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి 11 స్థానాలు వచ్చాయి. అయితే అందులో రిజర్వ్ స్థానాలే అధికం. ఇప్పటికిప్పుడు ఉప ఎన్నికలు జరగాలంటే.. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ గట్టి పోటీ ఇచ్చి గెలవాలంటే రెండే నియోజకవర్గాలు ఉన్నాయి. అందులో ఒకటి జగన్ ప్రాతినిధ్యం వహిస్తున్న పులివెందుల, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పుంగనూరు నియోజకవర్గాలు ఉన్నాయి. అయితే ప్రభుత్వ వైఫల్యాలను రెఫరండంగా తీసుకొని జగన్మోహన్ రెడ్డి పులివెందుల శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేయవచ్చు. ప్రతిపక్ష నేత హోదా ఇవ్వలేదని కారణం చూపవచ్చు. అయితే అంతటి సాహసం జగన్ చేస్తారా? అన్నది అనుమానమే. మొన్నటికి మొన్న పులివెందుల జడ్పిటిసి స్థానంలో కనీసం డిపాజిట్లు రాలేదు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి. అధికార జులంతో టిడిపి గెలిచిందని చెబుతున్న.. జడ్పీటీసీ కే ఈ స్థాయిలో ఉంటే.. ఎమ్మెల్యేకు ఎలాంటి అధికార ప్రయోగం ఉంటుందో జగన్మోహన్ రెడ్డికి తెలియంది కాదు. అందుకే ఆయన పులివెందుల శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేసే సాహసం చేయరని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
* ఆ నిర్ణయం సాహసం..
అయితే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి 11 స్థానాలు వచ్చాయి. ఎవరితో ఒకరికి రాజీనామా చేయించి ఉప ఎన్నికలు తెస్తే.. ఎలా ఉంటుందో నన్న ఆలోచన లేకపోలేదు. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వం పట్ల ప్రజల్లో సానుకూలత ఉంది. సంతృప్తి కొనసాగుతోంది. ఇటువంటి సమయంలో ఆ సాహసం చేస్తే తప్పకుండా ఇబ్బంది కరం అవుతుందని జగన్ సన్నిహితులు చెబుతున్నారు. దీంతో జగన్మోహన్ రెడ్డి సైతం ఏ నిర్ణయం తీసుకోలేకపోతున్నారు. అయితే పులివెందులలో బలంగా ఉన్నామని వైసిపి భావిస్తోంది. అందుకే అక్కడే రాజీనామా చేసి ఎన్నికలకు వెళితే బాగుంటుందన్న అభిప్రాయం వైసీపీలోనే వినిపిస్తోంది. మరి జగన్మోహన్ రెడ్డి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.