Tollywood Stars: టాలీవుడ్ స్టార్లు ఎక్కడ ఓటు వేయనున్నారో తెలుసా?

తెలంగాణలో రెండు రోజుల పాటు విద్యాసంస్థలకు రాష్ట్ర ప్రభుత్వం సెలవు ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో ఓటు హక్కును వినియోగించుకోవడానికి ప్రతి ఒక్కరు ఊర్లకు ప్రయాణం అవుతున్నారు.

Written By: Suresh, Updated On : November 29, 2023 4:08 pm

Tollywood Stars

Follow us on

Tollywood Stars: ఎన్నో రోజుల నుంచి ఎదురుచూస్తున్న రోజు రానే వచ్చింది. రేపటితో మరో కొత్త సర్కార్ రానుంది. ఉన్న గవర్నమెంట్ అలాగే ఉంటుందా? లేదా కొత్త ప్రభుత్వం వస్తుందా అనేది మరో వారంలో తెలియనుంది. అయితే ఈ నెల 30వ తారీకు అంటే రేపు ఎన్నికలు జరగనున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో నిన్నటితో ఎన్నికల ప్రచారానికి సమయం ముగియడంతో ఎన్నికల సంఘం పోలింగ్ కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఇప్పటికే ఎలక్షన్ పోలింగ్ బూత్ వద్ద భారీ బందోబస్తు నిర్వహిస్తున్నారు.

తెలంగాణలో రెండు రోజుల పాటు విద్యాసంస్థలకు రాష్ట్ర ప్రభుత్వం సెలవు ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో ఓటు హక్కును వినియోగించుకోవడానికి ప్రతి ఒక్కరు ఊర్లకు ప్రయాణం అవుతున్నారు. ఓటు వేయడం ప్రతి ఒక్కరి బాధ్యత. అందుకే దూర ప్రాంతాల్లో ఉన్నవారు ఇప్పటికే కొందరు ఊర్లకు చేరుకున్నారు కూడా. దీంతో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా రవాణా ఏర్పాట్లు కూడా సిద్దం చేశారు అధికారులు. ఇదిలా ఉంటే సినిమా యాక్టర్లు కూడా రేపు ఓటు వేయడానికి సిద్దమయ్యారు. మరి ఎవరెవరు ఎక్కడ ఓటు వేస్తున్నారో తెలుసా?

సినీ తారలు ఎక్కువగా జూబ్లీహిల్స్, ఫిల్మ్ నగర్ ఏరియా సమీపంలో ఉన్న పోలింగ్ కేంద్రాల్లో ఓటు వేయనున్నారు. అయితే హైదరాబాద్ లో ప్రభాస్, అల్లు అర్జున్, మహేష్ బాబు సహా మిగతా స్టార్ నటీనటులను కూడా ఓటు వేయనున్నారు.

జూబ్లీహిల్స్ క్లబ్.. మెగా స్టార్ చిరంజీవి, సురేఖ, ఉపాసన, రామ్ చరణ్, నితిన్

వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్.. నాగార్జున, అమల, నాగచైతన్య, అఖిల్

ఎమ్మెల్యే కాలనీ.. రవితేజ

ఓబుల్ రెడ్డి స్కూల్.. జూనియర్ ఎన్టీఆర్, ప్రణతి

మణికొండ.. ప్రభాస్, అనుష్క, వెంకటేష్, బ్రహ్మానందం

జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్.. మహేష్ బాబు, నమ్రత, మంచు మోహన్ బాబు, విష్ణు, మంచు లక్ష్మీ, మంచు మనోజ్, విజయ్ దేవరకొండ, ఆనంద్ దేవరకొండ, శ్రీకాంత్

ఎఫ్ ఎన్సీపీ.. రాఘవేంద్రరావు, జీవిత, రాజశేఖర్, దగ్గుబాటి రానా, సురేష్ బాబు, విశ్వక్ సేన్

బీఎస్ఎన్ఎల్ సెంటర్.. అల్లు అర్జున్, స్నేహారెడ్డి, అల్లు అరవింద్, అల్లు శిరీష్