https://oktelugu.com/

Bigg Boss 7 Telugu: అతి తెలివితో అడ్డంగా బుక్ అయిన గౌతమ్… బిగ్ బాస్ ఝలక్

''ఎత్తర జెండా '' అనే టాస్క్ లో భాగంగా పోటీదారులు తమ పడవను ఇసుకతో నింపాలి. ఎవరైతే ఎక్కువ ఇసుకతో పడవను నింపి .. జండా పైకి లేపుతారో వాళ్ళు విజేతలుగా నిలుస్తారు. కాగా ఇసుక చిన్న జగ్గులు తో తెచ్చి నింపాలి.

Written By: , Updated On : November 29, 2023 / 04:17 PM IST
Bigg Boss 7 Telugu

Bigg Boss 7 Telugu

Follow us on

Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ హౌస్ లో టికెట్ టూ ఫినాలే రేస్ పోటా పోటీగా సాగుతుంది. ఇందుకు సంబంధించి ఇప్పటికే మూడు గేమ్స్ నిర్వహించారు బిగ్ బాస్. అయితే అందరికంటే తక్కువ పాయింట్లు సాధించిన శివాజీ, శోభా శెట్టి ఫినాలే రేస్ నుంచి తప్పుకున్నారు. వారిద్దరి పాయింట్స్ రేస్ లో ఉన్న ఒకరికి ఇవ్వాలని బిగ్ బాస్ చెప్పారు. దీంతో శివాజీ, శోభా కలిసి అమర్ దీప్ కి తమ పాయింట్స్ ఇచ్చేసారు. అయితే శోభా శెట్టి ఓడిపోయినందుకు తెగ ఫీల్ అయింది.

తాజా ప్రోమోలో లీస్ట్ స్కోర్ సాధించిన శోభా .. స్కోర్ బోర్డు నుంచి తన ఫోటోలు తీసేసింది. అలా తీయ్యకూడదు శోభా అని అమర్ అన్నాడు. ‘ నేను తట్టుకోలేక పోతున్నాను .. రాత్రంతా అదే మైండ్ లో ఉంది. పొద్దున కూడా ఇది చూసి నాకు మైండ్ బ్లాంక్ అయిపోతుంది’ అంటూ ఎమోషనల్ అయింది శోభా. సరే తీసేయ్ ఏడవద్దు లే అంటూ అమర్ సర్ది చెప్పాడు. ఇక తర్వాత ఫినాలే రేస్ లో భాగంగా మరో టాస్క్ ఇచ్చారు బిగ్ బాస్.

”ఎత్తర జెండా ” అనే టాస్క్ లో భాగంగా పోటీదారులు తమ పడవను ఇసుకతో నింపాలి. ఎవరైతే ఎక్కువ ఇసుకతో పడవను నింపి .. జండా పైకి లేపుతారో వాళ్ళు విజేతలుగా నిలుస్తారు. కాగా ఇసుక చిన్న జగ్గులు తో తెచ్చి నింపాలి. ఈ టాస్క్ లో సంచాలకులుగా శోభా శెట్టి, శివాజీ వ్యవహరించారు. అయితే గౌతమ్ ఒక సిల్లీ స్ట్రాటజీ వాడాడు. అందరిలాగా ఇసుక తెచ్చి పోయకుండా.. ఆ పడవలో కింది వైపు ఉన్న ఇసుకని తీసుకుని .. పైన వేసాడు.

ఏం చేస్తున్నావ్ రా అని శివాజీ అడిగాడు. ఇసుక పోయమన్నారు .. తెచ్చి పోయాలని లేదు అని చెప్పాడు గౌతమ్. ఇందుకు సంచాలక్ శోభా నిరాకరించింది. ‘ నేను ఇది కన్సిడర్ చేయను అని చెప్పేసింది. ఇది ఫౌల్ కాదు మీరు రూల్ బుక్ చదవలేదా అంటూ వాదించాడు గౌతమ్. దీంతో బిగ్ బాస్ గౌతమ్ కి షాక్ ఇచ్చాడు. జండా వైపు నుంచి ఎంత ఇసుక తీసుకున్నాడో .. ఆ ఇసుక మళ్ళీ జండా వైపు నింపాలని చెప్పడంతో .. చేసేదేమి లేక తీసిన ఇసుక జండా వైపు నింపాడు గౌతమ్. ఈ క్రమంలో గౌతమ్ ట్రోల్స్ కి గురయ్యాడు.

 

Bigg Boss Telugu 7 Promo 1 - Day 87 | 'Flag Task' For Contestants To Get Finale Astra | Nagarjuna