Aaruguru Pathivrathalu: సినిమాల్లోకి నటులు వస్తుంటారు.. వెళ్తుంటారు. కానీ కొందరు మాత్రమే ఫేమస్ అవుతూ ఉంటారు. ఇంకొందరు ఒక్క సినిమాతోనే ఓవర్ నైట్ స్టార్ గా మారుతారు. అలా ఒకే ఒక్క సినిమాతో ఫేమస్ అయ్యారు. అమృత. అప్పటి వరకు ఫ్యామిలీ, కామెడీ చిత్రాలను తీసిన ఇవివి సత్యనారాయణ అందరికీ షాక్ ఇచ్చేలా డిఫరెంట్ మూవీని తీశారు. అదే ‘ఆరుగురు పతివ్రతలు’. ఈ సినిమాలో ఆరుగురు మహిళలు తమ జీవితంలో పడిన కష్టాల గురించి చెప్పుకుంటూ ఉంటారు. వీరిలో అమృత ఫేమస్ అయింది. అందం, అభినయంతో ఆకట్టుకున్న ఈమె కన్నడ ఇండస్ట్రీ నుంచి వచ్చారు.
‘ఆరుగురు పతివ్రతలు’ సినిమాలో అమృత స్టోరీ విభిన్నంగా ఉంటుంది. భర్త, ప్రియుడి మధ్య నలిగి పోతూ ఉంటుంది. సంసారంలో భర్తతో ఎదురైన ఇబ్బందులు ప్రియుడిపై కలిగే వ్యామోయం కారణంగా ఆమె ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంది? అన్న పాత్రలో నటించారు. అయితే ఇందులో అమృతను కొంచెం హాట్ గానే చూపించారు. ఈ సినిమాతో ఫేమస్ అయిన అమృత ఆ తరువాత మళ్లీ తెలుగు సినిమాల్లో కనిపించలేదు. అయితే కన్నడంలో పలు సినిమాల్లో నటించారు.
ఆమె చివరిసారిగా ‘జోడి నెంబర్ 1’ సినిమాలో కనిపించారు. ఆ తరువాత పెళ్లి చేసుకొని బెంగుళూరులో సెటిలయ్యారు. అయితే అమృత సినిమాల్లో ఫేమస్ కాకపోయినా సోషల్ మీడియాలో మాత్రం నిత్యం ఆమె గురించే చర్చ సాగుతూ ఉంటుంది. ఆమె నటించిన ఆరగురు పతివ్రతలు సినిమాలోని ఆమె నటించిన సీన్ కే ఎక్కువ ప్రాధాన్యం పెరిగింది. ఆ వీడియోను ప్రత్యేకంగా కట్ చేసి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.
తాజాగా అమృత మళ్లీ సినిమాల్లోకి వస్తుందని కొందరు ప్రచారం చేస్తున్నారు. కానీ ఆమె ఫ్యామిలీకే అంకితమైనట్లు తెలుస్తోంది. అయతే అమృత గుర్తుపట్టలేని విధంగా మారిపోయిందని కొందరు చెబుతున్నారు. కానీ మె లేటేస్ట్ ఫొటోలు సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడానికి మాత్రం సాహసించడం లేదు. ఏదీ ఏమైనా అమృత ఇప్పటికీ, ఎప్పటికీ ఫేమస్ నటిగానే మిగిలిపోతుందని కొందరు చర్చించుకుంటున్నారు.