https://oktelugu.com/

Chiranjeevi: తమిళ్ స్టార్ హీరో ఎంజీఆర్ చిరంజీవి కి చెప్పిన మాట ఏంటో తెలుసా..?

చిరంజీవి ఆ మాటను బలంగా నమ్ముతూ ప్రతి సినిమా షూటింగ్ లో ఎన్ని టేకులు తీసుకున్న పర్లేదు కానీ అవుట్ పుట్ మాత్రం బాగా వచ్చేలా చూసుకుంటూ జాగ్రత్త పడుతుంటాడట.

Written By:
  • Gopi
  • , Updated On : March 6, 2024 / 08:32 AM IST

    Chiranjeevi

    Follow us on

    Chiranjeevi: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న చాలామంది నటులు వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకోవడానికి అహర్నిశలు కష్టపడుతూ ఉంటారు. ఇక ఇలాంటి క్రమంలోనే మెగాస్టార్ చిరంజీవి లాంటి స్టార్ హీరో తన సినిమాలతో ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నాడు. ఇక ఇలాంటి చిరంజీవి చేసిన సినిమాలు ఒకప్పుడు మంచి విజయాలను అందుకోవడమే కాకుండా సూపర్ సక్సెస్ లను సాధించాయి.

    చిరంజీవి లాంటి నటుడుకి తన కెరియర్ మొదట్లో తమిళ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా గుర్తింపు పొందిన ఎం జీ ఆర్ ఒక ఇంపార్టెంట్ విషయాన్ని తెలియజేశాడంట. అది ఏంటి అంటే షూటింగ్ స్పాట్ లో ఒక ఆర్టిస్టు ఎన్ని టేకు లు తీసుకున్న పర్లేదు, కానీ ఫైనల్ గా మాత్రం మనం సాటిస్ఫై అవుతూ ప్రేక్షకుల్ని సాటిస్ఫై చేసేలా ఉండే నటనని మాత్రమే మనం చేయాలి. దాని కోసం షూటింగ్స్ స్పాట్లో ఎంత కష్టపడ్డా పర్లేదు గాని, సినిమా చేసిన తర్వాత ఇది ఇంకొంచెం బాగా చేసి ఉంటే బాగుండేది కదా అనే ఫీలింగ్ మాత్రం మనకు ఉండకుండా చూసుకోవాలి అని ఒక మాట చెప్పారంట.

    దాంతో చిరంజీవి ఆ మాటను బలంగా నమ్ముతూ ప్రతి సినిమా షూటింగ్ లో ఎన్ని టేకులు తీసుకున్న పర్లేదు కానీ అవుట్ పుట్ మాత్రం బాగా వచ్చేలా చూసుకుంటూ జాగ్రత్త పడుతుంటాడట.
    ఇక మొత్తానికైతే చిరంజీవికి తెలుగు సినిమా ఇండస్ట్రీలో మెగాస్టార్ గా గుర్తింపు రావడమే కాకుండా, 70 సంవత్సరాల వయసులో కూడా యంగ్ హీరోలకి సైతం పోటీని ఇస్తూ వరుస గా సక్సెస్ లను అందుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నాడు.

    ఇక ప్రస్తుతం విశ్వం భర సినిమా షూటింగ్ లో పాల్గొంటున్న చిరంజీవి ఈ సినిమా తర్వాత మరి కొంతమంది డైరెక్టర్లతో సినిమాలు చేయడానికి వాళ్లను కూడా లైన్ లో పెడుతున్నట్టుగా తెలుస్తుంది…ఇక విశ్వంభర సినిమా తన కెరియర్ కి మరో ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ లాంటి సినిమా అవుతుందని చిరంజీవి భావిస్తున్నట్లుగా తెలుస్తుంది…