
NTR- Kalyan Ram: నందమూరి హీరోలైన ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ ఈ తరం హీరోల్లో అరుదైన రికార్డు సొంతం చేసుకున్నారు. పవన్, మహేష్, ప్రభాస్, అల్లు అర్జున్, రామ్ చరణ్ లకు సాధ్యం కానీ ఆ రికార్డు ఏమిటో చూద్దాం. స్టార్ హీరోలు డబుల్ రోల్స్ చేసిన చిత్రాలు సంచలన విజయాలు నమోదు చేశాయి. ఎన్టీఆర్, ఏఎన్నార్ తో పాటు పరిశ్రమలో స్టార్స్ వెలిగిన చాలా మంది హీరోలు డ్యూయల్ రోల్ మూవీస్ చేశారు. కోలీవుడ్ కి చెందిన కమల్ హాసన్ ఏకంగా 10 పది పాత్రలు చేసి చరిత్ర సృష్టించారు. విశ్వరూపం మూవీలో కమల్ దశ పాత్రలు చేశారు.
ఏఎన్నార్ కూడా తక్కువేం కాదు. ఆయన 1966లో విడుదలైన నవరాత్రి మూవీలో 9 పాత్రలు చేశారు. ఎన్టీఆర్ దానవీరశూరకర్ణ చిత్రంలో కృష్ణుడు, కర్ణుడు, దుర్యోధనుడు పాత్రలు చేశారు. ఇక కృష్ణ, శోభన్ బాబు, చిరంజీవి కూడా ట్రిపుల్ రోల్స్ చేయడం జరిగింది. ఈ జనరేషన్ హీరోల్లో ట్రిపుల్ రోల్ ఎవరూ చేయలేదు. పవన్, రామ్ చరణ్, ప్రభాస్ డ్యూయల్ రోల్ చేశారు కానీ ట్రిపుల్ రోల్ చేయలేదు. ఇక మహేష్ చైల్డ్ ఆర్టిస్ట్ గా డ్యూయల్ రోల్స్ లో నటించారు.
ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ మాత్రం ద్విపాత్రాభినయంతో పాటు త్రిపాత్రాభినయం కూడా చేశారు. ఎన్టీఆర్ నా అల్లుడు, అదుర్స్ చిత్రాల్లో డ్యూయల్ రోల్ చేశారు. ఇక జై లవ కుశ మూవీలో ట్రిపుల్ రోల్ చేశారు. వాల్తేరు వీరయ్య ఫేమ్ కే ఎస్ రవీంద్ర ఈ చిత్రానికి దర్శకుడిగా ఉన్నారు. ఇక కళ్యాణ్ రామ్ హరే రామ్ మూవీలో డ్యూయల్ రోల్ చేశారు. ఆయన తాజా చిత్రం అమిగోస్ లో ట్రిపుల్ రోల్ చేశారు. ఫిబ్రవరి 10న ఈ చిత్రం విడుదల కానుంది. కాబట్టి ఈ జనరేషన్ హీరోల్లో ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ మాత్రమే త్రిపాత్రాభినయం చేశారు.

జై లవకుశ ఎన్టీఆర్ కి హిట్ ఇచ్చింది. మూడు పాత్రలు భిన్నమైన షేడ్స్ కలిగి ఉంటాయి. ఒక పాత్రను దొంగగా, మరొక పాత్రను దయలేని విలన్ గా, మూడో పాత్రను ఇన్నోసెంట్ బ్యాంక్ ఎంప్లొయ్ గా కేఎస్ రవీంద్ర తీర్చిదిద్దారు. అమిగోస్ సైతం ఇదే తరహాలో ఉండటం విశేషం. ఓ పాత్రలో కళ్యాణ్ మాఫియా లీడర్ గా కనిపిస్తున్నారు. మిగతా రెండు పాత్రలు పాజిటివ్ గా కనిపిస్తున్నాయి.
