Ram Charan Daughter Name: మెగా హీరో రామ్ చరణ్ తండ్రి అయిన విషయం తెలిసిందే. జూన్ 20 ఆదివారం రోజున రామ్ చరణ్, ఉపాసన దంపతులకు పండంటి ఆడబిడ్డ జన్మించింది. దాదాపు 11 ఏళ్ల నిరీక్షణ తర్వాత మెగా ఫ్యామిలీ ఇంట్లోకి వారసురాలు రావడంతో కుటుంబ సభ్యులు ప్రతి రోజు సంబరాలు చేసుకుంటున్నారు. ఐదు రోజులు ఆసుపత్రిలో ఉండి శుక్రవారం ఉపాసన డిశ్చార్జ్ అయ్యారు. ఈ సందర్భంగా రామ్ చరణ్ ఆమెతోనే ఉన్నారు. రామ్ చరణ్ ఉపాసన దంపతులు ఆస్పత్రి నుంచి బయటకు రాగానే మీడియాతో పాటు మెగా ఫ్యాన్స్ వారికి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం తమ కూతురికి ఏ పేరు పెడుతున్నారని అడగగా చెర్రీ ఇంట్రెస్టింగ్ గా రిప్లై ఇచ్చాడు.
2012 సంవత్సరంలో రామ్ చరణ్ -ఉపాసన ల వివాహం జరిగింది. ఆ సమయంలో ప్రముఖుల మధ్య ఘనంగా వేడుక నిర్వహించారు. అయితే పెళ్లయిన తర్వాత పిల్లల విషయంలో రామ్ చరణ్ దంపతులు ప్లానింగ్ లో ఉన్నట్లు సమాచారం. కొన్నాళ్లపాటు ఎంజాయ్ చేసిన తర్వాత పిల్లలను కనాలని డిసైడ్ అయినట్లు చర్చ జరుగుతుంది. అయితే నాలుగేళ్ల క్రితం వీరు పిల్లల కోసం ప్రయత్నాలు ప్రారంభించినట్లు సమాచారం. అప్పటి నుంచి వీరు తమ వారసుడి కోసం ఎదురుచూస్తున్నారు.
మెగా ఫ్యామిలీ ఇంట్లోకి వారసుడు కన్ఫర్మ్ అయినప్పటి నుంచి ఫ్యాన్స్ లో ఉత్సాహం నెలకొంది. ఉపాసన సైతం తమ గురించి ఫ్యాన్స్ కు అప్డేట్ ఇస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో జూన్ 20న ఆడపిల్లకు జన్మనిచ్చింది. చాలా రోజుల తర్వాత తమ ఫ్యామిలీలోకి మహాలక్ష్మి వచ్చిందని మెగాస్టార్ చిరంజీవితో పాటు సురేఖ ఇతర కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేశారు.
అయితే రామ్ చరణ్ ఉపాసన దంపతులు తమకు పుట్టబోయే బిడ్డ పేరు నాలుగేళ్ల కిందటే నిర్ణయించుకున్నారట. బాబు పుడితే ఏ పేరు పెట్టాలో.. పాప పుడితే ఏ పేరు పెట్టాలో డిసైడ్ అయ్యారట. ఈ సందర్భంగా అపోలో ఆసుపత్రి ఎదుట రామ్ చరణ్ మాట్లాడుతూ మా మా కూతురి పేరు మేము ఎప్పుడో డిసైడ్ చేశాం. అయితే 21 రోజుల తర్వాత నేనే మీకు స్వయంగా చెబుతా.. అని రామ్ చరణ్ చెప్పాడు. దీంతో రామ్ చరణ్ తమ కూతురికి ఏ పేరు పెడుతున్నారు అని మెగా ఫాన్స్ తెగ చర్చించుకుంటున్నారు. కొందరు లేటెస్ట్ గా ఉండే డిఫరెంట్ పేర్లు పెడతారని అంటుండగా.. మరికొందరు దేవుళ్ళ పేరు వచ్చేలా ఉంటుందని అనుకుంటున్నారు. ఏది ఏమైనా రామ్ చరణ్ చెప్పిన విధంగా 21 రోజుల తర్వాత ఎలాంటి ఇలాంటి పేరు బయటకు వస్తుందోనని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.