Gharana Mogudu: తమిళ్ సినిమా ఇండస్ట్రీలో రజనీకాంత్ సూపర్ స్టార్ గా తనకంటూ ఒక స్టార్ డమ్ ను క్రియేట్ చేసుకున్నాడు. తమిళ్ ఇండస్ట్రీ లో ఎవరికి సాధ్యం కానీ చాలా రికార్డ్ లను క్రియేట్ చేసి చాలా సంవత్సరాల పాటు తను సూపర్ స్టార్ గా కంటిన్యూ అవుతూ వస్తున్నాడు. ఇక ఇప్పటికి కూడా ఈయన హీరోగా సినిమాలు చేస్తూ ఇండస్ట్రీలో తన హవా ను కొనసాగిస్తున్నాడు. ఇక రీసెంట్ గా జైలర్ అనే సినిమాతో తెలుగు, తమిళ్ రెండు భాషల్లో భారీ విజయాన్ని అందుకొని దాదాపు 400 కోట్ల వరకు కలెక్షన్స్ ని రాబట్టాడు. ఇక ఇలాంటి రజనీకాంత్ ఒకప్పుడు తమిళం లో చేసిన ‘అనురాగ అరలితు’ అనే సినిమా సూపర్ సక్సెస్ అయింది.అయితే ఆ సినిమాని తెలుగులో చిరంజీవి హీరోగా ఘరానా మొగుడు అనే పేరు తో రీమేక్ చేశాడు.
తమిళ్ అభిమానులకి మన తెలుగు అభిమానులకి మధ్య చాలా తేడా ఉంటుంది. కాబట్టి మన నేటివిటీకి తగ్గట్టుగా ఆ కథని మార్పులు, చేర్పులు చేసి రాఘవేంద్రరావు దర్శకత్వంలో ఈ సినిమాని తెరకెక్కించారు. ఇక ఈ సినిమా సూపర్ సక్సెస్ కొట్టడంతో రజినీకాంత్ ఈ సినిమాని చూసి చిరంజీవిని అప్రిషియేట్ చేశారట. ‘ఒరిజినల్ వర్షన్ కంటే మీరు చేసిన రీమేక్ వర్షన్ చాలా బాగుంది’. నాకు కూడా అవకాశం ఉంటే మరొకసారి ఈ స్టోరీ తో సినిమా చేయాలని ఉంది అని తను చిరంజీవితో చెప్పడం నిజంగా అప్పట్లో ఒక హాట్ టాపిక్ గా మారింది.
ఇక ఆ తర్వాత వివిధ భాషల్లో ఈ సినిమాని రీమేక్ చేయాల్సి వచ్చినప్పుడు తెలుగు వర్షన్ నే రీమేక్ కోసం వాడుకున్నట్టు గా కూడా అప్పట్లో చాలా వార్తలు వచ్చాయి. ఇక రీమేక్ చేసిన అన్ని భాషల్లో ఈ సినిమా సూపర్ సక్సెస్ లను అందుకుంది. మొత్తానికైతే చిరంజీవి చేసిన రీమేక్ సినిమా రజనీకాంత్ ని ఇంప్రెస్ చేయడమే కాకుండా ఆ పాత్రలో మళ్ళీ తనకి నటించాలని అనిపించింది అంటే చిరంజీవి ఎంత వరకు ఆ పాత్రలో జీవించి ఉంటాడో మనం అర్థం చేసుకోవచ్చు…
అలాగే ఆ కథని కూడా కొంచెం మార్పులు, చేర్పులు చేయడంతో రజినీకాంత్ కి విపరీతంగా నచ్చిందట. ఇక తనకి ఏదైనా అనిపిస్తే ఆ విషయాన్ని మనసులో దాచుకోకుండా బయటికి చెప్పడంలో రజనీకాంత్ ఏ మాత్రం ఇబ్బంది పడడనే విషయాన్ని మరోసారి ప్రూవ్ చేశాడు..