Rajamouli And VV Vinayak: సినిమా ఇండస్ట్రీలో ఉన్న దర్శకుల మధ్య విపరీతమైన పోటీ ఉంటుంది. ఒకరు ఒక సినిమాతో సూపర్ సక్సెస్ ని సాధిస్తే వాళ్ళను మించిన సినిమాని చేయాలని మరొక దర్శకుడు ఆరాటపడుతూ ఉంటాడు… ఒకప్పుడు వివి వినాయక్ – రాజమౌళి మధ్య తీవ్రమైన పోటీ ఉండేది… రాజమౌళి జూనియర్ ఎన్టీఆర్ తో ‘స్టూడెంట్ నెంబర్ వన్’ అనే సినిమా చేశాడు. ఆ సినిమా సూపర్ సక్సెస్ అయింది. ఇక ఆ తర్వాత ఆది సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చినవినాయక్ భారీ బ్లాక్ బస్టర్ సక్సెస్ ని అందుకున్నాడు. మొత్తానికైతే రాజమౌళి కంటే వి వి వినాయక టాప్ డైరెక్టర్ గా మొదట పేరును సంపాదించుకున్నాడు. ఇక వీళ్లిద్దరి మధ్య పోటీ తీవ్ర స్థాయికి వెళ్లిపోయిందనే చెప్పాలి. ఒకానొక సందర్భంలో వీళ్ళిద్దరిలో ఎవరు టాప్ డైరెక్టర్ అనే డిస్కషన్ కూడా జరిగింది. ఇద్దరు వరుస సినిమాలను చేస్తూ మాస్ ప్రేక్షకులను అలరించడంలో సఫలీకృతమయ్యారు…
మొత్తానికైతే తెలుగు సినిమా ప్రేక్షకులకు ఒక కొత్త రకం సినిమాని అందించడానికి వీళ్ళు చాలా ప్రయత్నం చేశారు… ఇక వివి వినాయక్ ని బీట్ చేయడానికి రాజమౌళి ఒక అస్త్రం ప్రయోగించాడు. అదేంటి అంటే రెగ్యూలర్ మాస్ మసాలా సినిమాలను చేస్తే వర్కౌట్ కాదని మగధీర తో సోషియో ఫాంటసీ మూవీని చేసి ప్రేక్షకుల్లో విశేషమైన స్పందనను సంపాదించుకున్నాడు. ఇక ఈ సినిమాతో ఇండస్ట్రీ హిట్ ని కూడా దక్కించుకున్నాడు…
ఇక అప్పటినుంచి తన పంథా ను పూర్తిగా మార్చేసి సినిమాలు చేయడానికి ఆసక్తి చూపించాడు. మాస్ ప్రేక్షకులను అలరిస్తూనే అందులో గ్రాఫిక్స్ కి ఎక్కువ ప్రాధాన్యతని ఇస్తూ ప్రేక్షకులను మెప్పించడంలో ఆయన సూపర్ సక్సెస్ అయ్యాడు. మొత్తానికైతే వివి వినాయక్ ని డామినేట్ చేయడానికి రాజమౌళి వేసిన ప్లాన్ సక్సెస్ అయింది. దాంతో రాజమౌళి టాప్ పొజిషన్ కి వెళ్లిపోయాడు. ఆ తర్వాత వినాయక్ ను డామినేట్ చేయడానికి రాజమౌళి కొన్ని స్ట్రాటజీలను వాడాడు…
అవన్నీ వర్కౌట్ అయ్యాయి…మొత్తానికైతే ఆయన ప్రస్తుతం ఇండియాలో నెంబర్ వన్ డైరెక్టర్ గా పేరు సంపాదించుకున్నాడు. ఇక వినాయక్ మాత్రం వరుసగా కమర్షియల్ సినిమాలు చేస్తూ వచ్చాడు. అవి పెద్దగా ఆడకపోవడంతో ఆయన మార్కెట్ ను చాలావరకు కోల్పోయాడు…ప్రస్తుతం సినిమాలు లేకుండా ఖాళీగా ఉన్నాడు…