https://oktelugu.com/

Pradeep Machiraju: యాంకరింగ్ మానేసిన ప్రదీప్ మాచిరాజు చేస్తున్న పనులు ఇవా… వీడియో వైరల్!

ప్రస్తుతం హీరో నందు .. ప్రదీప్ స్థానంలో యాంకర్ గా వ్యవహరిస్తున్నాడు. దీంతో ప్రదీప్ ఫ్యాన్స్ ఆయన ఏమైపోయాడు .. ఎక్కడా కనిపించడం లేదని ఆరా తీస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా అతనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది.

Written By:
  • S Reddy
  • , Updated On : March 12, 2024 / 04:42 PM IST

    Pradeep Machiraju

    Follow us on

    Pradeep Machiraju: యాంకర్ ప్రదీప్ మాచిరాజు క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. స్టార్ యాంకర్ గా బుల్లితెరపై హవా సాగిస్తున్నాడు. మేల్ యాంకర్స్ లో ఎవరికీ లేనంత ఫ్యాన్ ఫాలోయింగ్ ప్రదీప్ సొంతం. అతని స్క్రీన్ ప్రెజెన్స్, కామెడీ టైమింగ్ కి ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే. అనూహ్యంగా ప్రదీప్ యాంకరింగ్ కి దూరం అయ్యాడు. ఒక్క షోలో కూడా ప్రదీప్ కనిపించడం లేదు. ముఖ్యంగా ప్రదీప్ ఢీ రియాలిటీ షోని వీడడం అనూహ్య పరిణామం. ఏళ్లుగా ఈ షోకి ప్రదీప్ స్పెషల్ అట్రాక్షన్ గా ఉన్నాడు.

    ప్రస్తుతం హీరో నందు .. ప్రదీప్ స్థానంలో యాంకర్ గా వ్యవహరిస్తున్నాడు. దీంతో ప్రదీప్ ఫ్యాన్స్ ఆయన ఏమైపోయాడు .. ఎక్కడా కనిపించడం లేదని ఆరా తీస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా అతనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. ప్రదీప్ న్యూ లుక్ చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు. ఈ వీడియోలో ప్రదీప్ జిమ్ లో వర్కౌట్స్ చేస్తూ కనిపించాడు. అతడు కండలు తిరిగిన శరీరం కలిగి ఉన్నాడు.

    అంతే కాదు బాడీ బిల్డ్ చేయడానికి స్ట్రిక్ట్ డైట్ ఫాలో అవుతున్నట్లు వీడియో చూస్తే అర్ధం అవుతుంది. ఇక ప్రదీప్ నయా అవతార్ చూసిన నెటిజన్లు రక రకాలుగా స్పందిస్తున్నారు. ఇందుకేనా షోలు మానేసింది. కొత్త మూవీ కోసమా .. సినిమాలు మనకి వద్దు .. హాయిగా యాంకరింగ్ చేసుకుందాం అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. గతంలో ప్రదీప్ పలు సినిమాల్లో చిన్న చిన్న రోల్స్ చేశారు. 30 రోజుల్లో ప్రేమించడం ఎలా? సినిమాలో హీరోగా నటించాడు.

    ఆ తర్వాత మళ్ళీ యాంకరింగ్ కంటిన్యూ చేశాడు. ప్రస్తుతం మరో సినిమా చేయడం కోసమే యాంకరింగ్ మానేసినట్లు తెలుస్తుంది. తన న్యూ లుక్ సీక్రెట్ గా ఉంచడానికి షో లు చేయడం లేదని సమాచారం. కాగా ప్రదీప్ ఇంకా పెళ్లి చేసుకోలేదు.అతని పెళ్లి గురించి నిత్యం సోషల్ మీడియాలో రూమర్లు వినిపిస్తూనే ఉంటాయి. బుల్లితెర పై మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గా ఉన్నాడు. ఇక ప్రదీప్ న్యూ లుక్ ఆకట్టుకుంటుంది. సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.