Nayanthara: సౌత్ ఇండియన్ లేడీ సూపర్ స్టార్ గా ఎదిగింది నయనతార. దేశంలో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునే హీరోయిన్స్ లో ఒకరు. ప్రస్తుతం నయనతార సినిమాకు రూ. 10 కోట్ల వరకూ తీసుకుంటుందని సమాచారం. జవాన్ మూవీతో బాలీవుడ్ లో అడుగుపెట్టిన నయనతార బ్లాక్ బస్టర్ కొట్టింది. అట్లీ దర్శకత్వంలో షారుఖ్ ఖాన్ నటించిన జవాన్ ఏకంగా వెయ్యి కోట్ల వసూళ్లు కొల్లగొట్టింది. ఇక ఇంతటి స్టార్డమ్ అనుభవిస్తున్న నయనతార కెరీర్ బిగినింగ్ లో ఏం చేశేవారో తెలుసా?
నయనతారకు సంబంధించిన ఒక ఓల్డ్ వీడియో వైరల్ అవుతుంది. సదరు వీడియోలో నయనతార యాంకరింగ్ చేస్తున్నారు. అవును నయనతార ఒక మలయాళ టీవీ ఛానల్ లో యాంకర్ గా చేసింది. ఓ షోకి ఆమె వ్యాఖ్యాతగా వ్యవహరించింది. మలయాళంలో అనర్గళంగా మాట్లాడుతున్న నయనతార వీడియో వైరల్ అవుతుంది. అలా యాంకర్ గా కెరీర్ మొదలు పెట్టిన నయనతార… 2003లో మనసైనకారే అనే మలయాళ చిత్రంతో సిల్వర్ స్క్రీన్ కి పరిచయమైంది.
నయనతార అసలు పేరు డయానా అట. మొదటి చిత్ర దర్శకుడు నయనతారగా స్క్రీన్ నేమ్ వేశాడు. అప్పటి నుండి ఆమె నయనతారగా ఫేమస్ అయ్యింది. చంద్రముఖి సినిమాతో నయనతారకు బ్రేక్ వచ్చింది. ఆ మూవీలో ఏకంగా రజినీకాంత్ కి జంటగా నటించే ఛాన్స్ కొట్టేసింది. చంద్రముఖి బ్లాక్ బస్టర్ కావడంతో నయనతారకు తమిళ్, తెలుగు భాషల్లో ఆఫర్స్ వచ్చాయి. గజినీ కూడా ఆమెను సౌత్ లో పాపులర్ చేసింది.
ఇక తెలుగులో నయనతార లక్ష్మి, యోగి, దుబాయ్ శ్రీను వంటి హిట్ చిత్రాల్లో నటించింది. చిరంజీవి, వెంకటేష్, నాగార్జున, బాలకృష్ణలతో పాటు ప్రభాస్, ఎన్టీఆర్ లకు జంటగా నటించింది. ఎన్టీఆర్ తో ఆమె చేసిన అదుర్స్ మంచి విజయం సాధించింది ఇక నయనతార జీవితంలో అనేక వివాదాలు ఉన్నాయి. శింబు, ప్రభుదేవాలతో ఆమె ఎఫైర్ నడిపారు. నయనతారను పెళ్లి చేసుకునేందుకు ప్రభుదేవా భార్యకు విడాకులు ఇచ్చాడు. అయితే బ్రేకప్ అయ్యారు. 2015 నుండి దర్శకుడు విగ్నేష్ శివన్ తో డేటింగ్ చేసిన నయనతార 2022లో వివాహం చేసుకుంది .
View this post on Instagram