Chiranjeevi-Dasari Narayana Rao: ఒక సినిమా సక్సెస్ అవ్వడానికి ఆ సినిమా స్టోరీ ఎలా ఉన్నా కూడా, దాంట్లో ఎవరు నటించారు అనేది కూడా కీలక పాత్ర వహిస్తుంది. కొన్ని సినిమాల్లో ప్రత్యేకమైన పాత్రలు ఉంటాయి. వాటిలో కొంతమంది మాత్రమే నటించి జీవించగలరు ఆ పాత్రల ద్వారా సినిమా ఇంపాక్ట్ అనేది మారిపోతూ ఉంటుంది. అందుకే వాటిని నార్మల్ నటులు చేసే కంటే మంచి ఇమేజ్ ఉన్న నటులు చేస్తే ఆ పాత్ర పరిధి పెరగడమే కాకుండా, ఆ క్యారెక్టర్ జనాలకి ఈజీగా కనెక్ట్ అవుతుంది. అందుకోసమే కొన్ని ప్రత్యేకమైన పాత్రల కోసం మంచి నటులను తీసుకోవడానికి దర్శక నిర్మాతలు ఎప్పుడూ పోటీ పడుతూ ఉంటారు.
ఇక ఇలాంటి క్రమంలోనే చిరంజీవి హీరోగా వచ్చిన హిట్లర్ సినిమాలో డైరెక్టర్ ముత్యాల సుబ్బయ్య చిరంజీవి తండ్రి పాత్రకి ముందుగా ఒక మలయాళ నటుడిని తీసుకుందామని అనుకున్నాడట, కానీ చిరంజీవి మాత్రం మలయాళ నటుడు అయితే తెలుగు ప్రేక్షకులకి అంత గా కనెక్ట్ కాలేడు అని చెప్పి, ఈ పాత్రకి దాసరి నారాయణరావు గారిని తీసుకుందామని ముత్యాల సుబ్బయ్య తో చెప్పాడట, దానికి డైరెక్టర్ కూడా ఓకే అని దాసరి గారిని అడిగాడట. కానీ దాసరి గారు ముందుగా ఆ క్యారెక్టర్ చేయడానికి ఒప్పుకోలేదట. కానీ చిరంజీవి అడగడంతో కాదనలేక దాసరి ఆపాత్రని చేశాడట.
ఆయన చేసిన ఆ పాత్ర వల్ల సినిమా మొత్తానికి మంచి బజ్ అయితే ఏర్పడింది. ఇక అలాగే చిరంజీవి తండ్రి పాత్ర కావడం తో ఆయన ఆ పాత్ర చేయడం వల్ల చిరంజీవి పాత్రకి కూడా అది మరింత ప్లస్ అయిందనే చెప్పాలి. ఇక ఇది ఇలా ఉంటే అప్పటివరకు ఇండస్ట్రీలో చిరంజీవికి, దాసరి గారికి మధ్య మాటలు లేవని చాలామంది అనుకున్నారు.
కానీ హిట్లర్ సినిమాలో దాసరి గారి చేత చిరంజీవే ఆ పాత్రను వేయించాడు అని తెలుసుకున్న చాలా మంది సినీ పెద్దలు సైతం చిరంజీవికి, దాసరి గారికి మధ్య విభేదాలు ఏమీ లేవు వాళ్ళు ఎప్పుడు కలిసిమెలిసి ఉంటారు అనే ఒక నిర్ణయానికి వచ్చారు.
నిజానికి దాసరి గారికి, చిరంజీవికి మధ్య విభేదాలు ఏమీ లేకపోయినప్పటికీ మధ్యలో కొంతమంది కొన్ని ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయడం వల్లే వాళ్ళ మధ్య డిస్టెన్స్ అయితే పెరిగిందనేది వాస్తవం. కానీ ఈ సినిమాతో ఆ దూరం తగ్గిపోయిందనే చెప్పాలి..