https://oktelugu.com/

Narasimha Movie: ‘నరసింహా’ సినిమాలో సౌందర్య ముఖంపై రమ్యకృష్ణ కాలుపెట్టే ముందు ఏం జరిగిందో తెలుసా?

కేఎస్ రవికుమార్ డైరెక్షన్లో వచ్చిన ‘నరసింహా’ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా వచ్చిన ఇందులో సౌందర్యతో పాటు రమ్యకృష్ణ నటించారు. ఇద్దరు సరిసమానంగా ప్రాధాన్యత ఇచ్చి కేఎస్ రవికుమార్ ప్రేక్షకులను మెప్పించారు. అయితే ఇందులో సౌందర్యది సాఫ్ట్ క్యారెక్టర్ కాగా.. రమ్యకృష్ణది ప్రతికూల పాత్ర.

Written By:
  • Srinivas
  • , Updated On : July 11, 2023 / 05:13 PM IST

    Narasimha Movie

    Follow us on

    Narasimha Movie: ఒకప్పుడు సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ల సంఖ్య తక్కువగా ఉండేది. దీంతో ఇండస్ట్రీకి వచ్చిన వారి మధ్య తీవ్ర పోటీ ఉండేది. ఒకరి కంటే మరొకరు పోటీ పడి నటించేవారు. మరికొందరు ఫేమస్ కావడానికి కాస్త గ్లామర్ ను చూపించేవారు. అయితే అందాల నటి, దివంగత సౌందర్య మాత్రం ఏమాత్రం హద్దులు దాటకుంటా వందల కొద్దీ సినిమాలు చేసింది. ఆమె అమాయకమైన నటనే అందరినీ ఆకట్టుకునేది. ఈమెకు భిన్నంగా రమ్యకృష్ణ మాత్రం చాలా రాష్ గా నటించేవారు.అవసరమైన చోట గ్లామర్ షో చేస్తూ నటించేవారు. ఇద్దరూ భిన్నరకాలుగా నటించే ఈ హీరోయిన్లు కలిసి ‘నరసింహా’ అనే సినిమాలో నటించారు. ఈ సినిమాలో సౌందర్యపై ముఖంపై కాలుతో టచ్ చేసే సీన్ ఉంటుంది. ఈ సమయంలో సౌందర్య షాకింగ్ కామెంట్ చేశారట. అదేంటంటే?

    కేఎస్ రవికుమార్ డైరెక్షన్లో వచ్చిన ‘నరసింహా’ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా వచ్చిన ఇందులో సౌందర్యతో పాటు రమ్యకృష్ణ నటించారు. ఇద్దరు సరిసమానంగా ప్రాధాన్యత ఇచ్చి కేఎస్ రవికుమార్ ప్రేక్షకులను మెప్పించారు. అయితే ఇందులో సౌందర్యది సాఫ్ట్ క్యారెక్టర్ కాగా.. రమ్యకృష్ణది ప్రతికూల పాత్ర. నరసింహను దక్కించేకుందుకు వేసే పన్నాగం పాత్రను రమ్యకృష్ణ నటించారు. ఈ సినిమాతోనే రమ్యకృష్ణ విలన్ పాత్రను కూడా మెప్పించగలరని నిరూపించారు. ముందుగా ఈ పాత్రలో నగ్మాను అనుకున్నారు. కానీ ఆ తరువాత రమ్యకృష్ణ కు ఇవ్వడంతో ఆ పాత్రకు సరైన న్యాయం చేశారు.

    అయితే సినిమాలో యజమానురాలిగా రమ్యకృష్ణ నటించగా.. పనిమనిషి పాత్రలో సౌందర్య పోషించారు. ఈ క్రమంలో ఓ సీన్ లో రమ్యకృష్ణ కాలును సౌందర్య పట్టుకోవాల్సి వస్తుంది. తన కాలును భుజాన పెట్టుకొని మసాజ్ చేయాలి. ఈ సీన్ ముందుగా రమ్యకృష్ణ కు చెప్పగానే ఆమె కంగారు పడిందట. సౌందర్య అప్పటికే టాప్ హీరోయిన్లలో ఒకరుగా ఉన్నారు. అలాంటి హీరోయిన్ పై నేను కాలు పెట్టడమేంటి? అని అన్నారు. అయితే అదే సమయంలో అక్కడే ఉన్న సౌందర్య వెంటనే రమ్యకృష్ణ కాలును తీసుకొని తన భుజాన వేసుకొని మసాజ్ చేసిందట. వెంటనే కెమెరామెన్ ఈ సీన్ ను ఎలాంటి టేక్ లు లేకుండా తీశాడట.

    ఆ తరువాత ఈ సీన్ పై చాలా విమర్శలు వచ్చాయి. చాలా మంది సౌందర్య అభిమానులు ఈ సీన్ తీసేయాలని అన్నారు. మరికొందరు మాత్రం అక్కడున్నది సౌందర్య కాదని, ఎవరో డూప్ ను పెట్టారని చెప్పుకొచ్చారు. అయితే ఆ తరువాత కేఎస్ రవికుమార్ స్పందిస్తూ ఈ సీన్ అక్కడ తప్పకుండా అవసరం. అందుకే చేయాల్సి వచ్చిందని అన్నారు. ఇక సౌందర్యకు డూప్ గా ఎవరూ నటించలేదని, ఆమెనే ఇలా చేసిందని చెప్పుకొచ్చారు.