Alia Bhatt Daughter Name: బాలీవుడ్ లవ్లీ కపుల్ రణబీర్, ఆలియా ఈమధ్య సోషల్ మీడియాలో తెగ సందడి చేస్తున్నారు. ఒకరినొకరు గాఢంగా ప్రేమించుకున్న ఈ జంట పెద్దలను ఒప్పించి పెళ్లిచేసుకుంది. ఆ తరువాత రెండు నెలలు తిరగకముందే అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఇలా ఏడు నెలలు గడిచాక.. ఈ ఆదివారం ఆలియా ఓ పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. తమ ఇంట్లోకి మహాలక్ష్మి వచ్చిందని రణబీర్ జంట ఫుల్ ఖుషీ అయింది. ఈ తరుణంలో ఆలియా జంటకు జన్మించిన కూతురుకు ఏ పేరు పెడుతారు..? అనే చర్చ సాగుతోంది. అయితే బిడ్డ పుట్టకముందే ఆలియా ఓ పేరు అనుకుందట. ఓ సందర్భంలో ఆమె తనకు పుట్టబోయే బిడ్డకు ఆ పేరే పెడుతానని కూడా చెప్పింది. దీంతో ఫ్యాన్స్ ఇప్పుడు ఆ పేరే పెట్టాలని అంటున్నారు. ఇంతకీ ఆ పేరేంటి..?

రణబీర్ కపూర్, ఆలియా భట్ ముంబైలోని ఓ నివాసంలో కొన్నేళ్లపాటు డేటింగ్ చేశారు. ఆ తరువాత 2022 ఏప్రిల్ 14న వివాహం చేసుకున్నారు. ఈ వివాహానికి అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు. పెళ్లయిన రెండు నెలలకే ఈ జంట తాము తల్లిదండ్రులం కాబోతున్నామని అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఇలా ఏడు నెలలు గడిచాక ఈ ఆదివారం ముంబైలోని హెచ్ఎస్ రిలయన్స్ ఆసుపత్రికి ఆలియా తన భర్తతో కలిసి వచ్చింది. వీరితో పాటు ఆలియా తల్లి సోని రజ్దాన్ కూడా వచ్చారు. ఆ తరువాత ఆలియా ఆడబిడ్డకు జన్మనిచ్చి అందరినీ సర్ ప్రైజ్ చేసింది.
అయితే ఆలియా కూతురుకు ఏ పేరు పెడుతారు..? అనే ట్యాగ్ లైన్ పై సోషల్ మీడియాలో చర్చ సాగుతోంది. ఈ నేపథ్యంలో ఓ పేరు మారుమోగుతోంది. డెలీవరికి ముందు ఆలియా ఓ రియాలిటీ షో లో పాల్గొన్నారు. అక్కడ కంటెస్టెంట్లతో సందడి చేశారు. ఈ క్రమంలో అక్కడున్న చిన్న బాబును ఎత్తుకొని తన పేరు చెప్పమని అడిగింది. అందుకు తాను ‘అల్మా’ అని చెప్పాడు. ఆ పేరు స్పెల్లింగ్ చెప్పమని ఆలియా మరోసారి అడిగింది. దీంతో ఆ బాబు ALMAA అని చెప్పాడు. దీంతో ఆలియా గట్టిగా నవ్వుతూ ‘అల్మా.. బహుత్ సుందర్ నామ్ హే..’ అని అంది. అలాగే ‘నాకు కూతురు పుడితే ఈ పేరే పెడతా’ అని చెప్పింది.

ఇప్పుడు ఆ పేరే పెట్టాలని ఫ్యాన్స్ అడుగుతున్నారు. అనుకున్నట్లే ఆలియాకు ఆడబిడ్డ పుట్టడంతో ఆ పేరు పెట్టాలని అందరూ కోరుకుంటున్నారు. అయితే ముందుగా చెప్పినట్లు ఆలియా ఆ పేరు పెడతారా..? వేరే పేరు పెడతారా..? అనేది చర్చనీయాంశంగా మారింది. ఇక ఆలియా, రణబీర్ కలిసి నటించిన ‘బ్రహ్మస్తం’ ఓవరాల్ గా రూ.400 కోట్లు రాబట్టింది. దీంతో వారింట్లో డబుల్ ధమాకా వచ్చినట్లయింది. అటు ఆలియా మన తెలుగు సినిమా ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలో నటించిన విషయం తెలిసిందే.