Sreeleela: శ్రీలీల.. ప్రస్తుతం టాలీవుడ్‌లో మంచి ట్రెండింగ్‌లో ఉన్న తెలుగు హీరోయిన్. చాలా ఏళ్ల తర్వాత ఓ తెలుగు అమ్మాయి.. టాలీవుడ్‌లో నంబర్ వన్ పొజీషన్‌కు వచ్చింది. ఇక శ్రీలీల తన సినిమాల్లో డాన్స్‌తో దుమ్ము రేపుతోంది. ఆమె సినిమాలకు యూత్ కేవలం డాన్స్ చూసేందుకే వస్తున్నారు అంటే అతిశయోక్తి కాదు. ఇక గుంటూరు కారం ప్రీ రిలీజ్ ఫంక్షన్‌లో ప్రిన్స్ మహేశ్‌బాబే శ్రీలీల డాన్స్‌ను అభినందించారు. ఆమెతో డాన్స్ చేయడం అంత ఈజీ కాదని కూడా పేర్కొన్నారు. ఇక శ్రీలీల ఈ ఏడాదంతా తీరిక లేకుండా సినిమాలు చేయడానికి ఇప్పటికే డేట్స్ ఇచ్చేసింది. అయితే డాక్టర్ అయిన శ్రీలీల గురించి కొన్ని విషయాలు ఎవరికీ తెలియవు. అవేంటో తెలుసుకుందాం..
= శ్రీలీల 20001, జూన్ 14న భారతీయ సంతతికి చెందిన తెలుగు అమెరికన్ కుటుంబంలో పుట్టింది. శ్రీలీల తల్లి డాక్టర్. ఆమెకు ఇద్దరు అన్నలు ఉన్నారు.
= శ్రీలీల ఇద్దరు అనాథ పిల్లను దత్తత తీసుకుని వారి బాగోగులను తానే చూసుకుంటోంది.
= శ్రీలీల తెలుగు డైరెక్టర్ అనిల్ రావిపూడికి వరుసకు మేన కోడలు అవుతుంది.
= శ్రీలీలకు స్ట్రీట్ షాపింగ్ అంటే చాలా ఇష్టం. ఇలా చేయడం ద్వారా డబ్బులు ఆదా కావడమే కాకుండా, చిరు వ్యాపారులను ప్రోత్సహించినట్లు అవుతుందని శ్రీలీల భావిస్తారు.
= తెలుగు, కన్నడ సినిమాల్లో నటించిన శ్రీలీల ఫస్ట్ సినిమా మాత్రం కన్నడలోనే తీశారు. 2019లో కిస్ చిత్రంతో అరంగేట్రం చేసింది. దీనికి సైమా అవార్డు బెస్ట్ ఫిమేల్ డెబ్యూ అవార్డు వచ్చింది. ఆ తర్వాత భరతే(కన్నడ) తీశారు. తెలుగులో 2021లో పెళ్లి సందడితో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యారు.
= పెళ్లి సందడి సినిమాకు శ్రీలీల కేవలం రూ.5 లక్షల రెమ్యునరేషన్ తీసుకుంది. ఇప్పుడు రూ.2 కోట్ల నుంచి రూ.3 కోట్లు వసూలు చేస్తోంది.
= శ్రీలీల షూటింగ్‌కు వెళ్తే వాళ్ల అమ్మగారు ప్రతీ అరగంటకు ఒకసారి ఫోన్ చేస్తారట.
= డాక్టర్ కావాలనుకున్న శ్రీలీల ఎంతో కష్టపడి చదివి 2021లో తన ఎంబీబీఎస్ పూర్తి చేసింది.
= ఇక లాస్ట్.. బట్‌నాట్ లీస్ట్.. శ్రీలీలకు డస్ట్ ఎలర్జీ ఉంది. ఒకసారి తుమ్ము వచ్చిందంటే.. దాదాపు పది నుంచి ఇరవై సార్లు తుమ్ముతూనే ఉంటుంది.