Senior Hero Arjun Assets: ఈ జనరేషన్ కి అర్జున్ గొప్పతనం పెద్దగా తేలికపోవచ్చు కానీ 80-90లలో యూత్ గా ఉన్నవారికి బాగా తెలుసు. ఆయన కన్నడ, తమిళ, తెలుగులో సమానంగా రాణించిన హీరో. కన్నడిగుడైన అర్జున్ కి మూడు ప్రధాన భాషల్లో భారీ మార్కెట్ ఏర్పడింది. టాలీవుడ్ ఆడియన్స్ రజనీకాంత్, కమల్ హాసన్ రేంజ్ లో ఆయన చిత్రాలను ఆదరించేవారు. అర్జున్ కి ఫ్యాన్ బేస్, మార్కెట్ ఉండేది. కెరీర్ బిగినింగ్ లోనే అర్జున్ తెలుగులో అడుగుపెట్టాడు. ఆయన మొదటి తెలుగు చిత్రం మా పల్లెలో గోపాలుడు భారీ విజయం. దర్శకుడు కోడి రామకృష్ణ తెరకెక్కించిన ఈ మూవీ సక్సెస్ అర్జున్ ని తెలుగులో స్టార్ చేసింది.

అర్జున్ నటించిన జెంటిల్ మెన్, ఒకే ఒక్కడు తెలుగులో ఎంత పెద్ద విజయాలు సాధించాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక అర్జున్ కేవలం నటుడే కాదు. ఆయన దర్శకుడు, రచయిత, నిర్మాత కూడాను. అర్జున్ డైరెక్షన్ లో 11 చిత్రాలు తెరకెక్కాయి. వాటిలో జై హింద్ వంటి సక్సెస్ ఫుల్ చిత్రాలు ఉన్నాయి. డిస్ట్రిబ్యూటర్ గా కూడా అర్జున్ కి అనుభవం ఉంది. యాక్షన్ హీరోగా అర్జున్ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు.
అర్జున్ ప్రస్తుతం విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేస్తున్నారు. ఆయన సెకండ్ ఇన్నింగ్స్ సక్సెస్ ఫుల్ గా సాగుతుంది. కాగా వారసత్వంగా వచ్చిన ఆస్తితో పాటు పెద్ద ఎత్తున సంపాదించిన అర్జున్ సంపద విలువ వందల కోట్లు అని తెలుస్తుంది. కన్నడ పరిశ్రమలో ధనవంతులైన నటుల్లో అర్జున్ ఒకరు. అర్జున్ నివాసమే రూ. 18 కోట్ల విలువ ఉంటుందట. రూ. 7.5 కోట్ల విలువ చేసే 5 లగ్జరీ కార్లు ఉన్నాయట.

సినిమాకు అర్జున్ రూ. 3 కోట్లకు పైనే తీసుకుంటునున్నారని సమాచారం. భార్య, ఇద్దరు కూతుళ్ళ పేరున ఉన్న స్థిర చర ఆస్తులు లెక్కకడితే వాటి విలువ రూ. 400 కోట్లకు పైమాటేనట. కాగా అర్జున్ ఆంజనేయస్వామి పరమ భక్తుడు. నిత్యం ఆయన్ని ఆరాధిస్తాడు. చెన్నై శివార్లలో పెద్ద ఆంజనేయ స్వామి గుడిని అర్జున్ నిర్మిస్తున్నాడు. 35 అడుగుల భారీ ఆంజనేయ స్వామి విగ్రహాన్ని ఆ గుడిలో ప్రతిష్ట చేస్తున్నారు. ఆ గుడి నిర్మాణానికి అయ్యే ఖర్చు మొత్తం అర్జున్ స్వయంగా భరిస్తున్నారట. అర్జున్ ఏదో క్యారెక్టర్ ఆర్టిస్ట్ అని చులకన చూసే వారికి ఈ డీటెయిల్స్ తెలిస్తే మైండ్ బ్లాక్ అవుతుంది.