Rajamouli Assets: సినిమా ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది డైరెక్టర్లలో రాజమౌళి ఒకరు. ఈయన తీసిన చాలా సినిమాలు ఇండస్ట్రీలో వరసగా బ్లాక్ బస్టర్ విజయాలను అందుకున్నాయి.దాంతో ఇండస్ట్రీ లో ఆయనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. తెలుగు సినిమా డైరెక్టర్ గా కెరీర్ మొదలు పెట్టిన ఆయన ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. నిజానికి ఈయన చేసిన సినిమాలు వరుసగా హిట్లు కొట్టడంతో పాటుగా ప్రభాస్ తో ఆయన చేసిన బాహుబలి సినిమా వరల్డ్ వైడ్ గా సూపర్ కలెక్షన్ తీసుకొచ్చి పెట్టాయి. అలాగే రామ్ చరణ్, ఎన్టీఆర్ లను పెట్టీ మల్టీస్టారర్ గా తీసిన సినిమా అయిన ఆర్ఆర్ఆర్ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది.
ఇక ఈ సినిమాతో పాటుగా ప్రస్తుతం ఆయన మహేష్ బాబు తో ఒక ప్యాన్ వరల్డ్ సినిమా చేస్తున్నాడు.ఇది కూడా సక్సెస్ అయితే రాజమౌళి తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టడంలో ఎలాంటి సందేహం లేదు. అలాగే ప్రపంచవ్యాప్తంగా ఒక తెలుగు డైరెక్టర్ మన తెలుగు సినిమా ఇండస్ట్రీ గురించి ప్రపంచం మాట్లాడుకునే చేస్తున్నాడు.ఇక ప్రస్తుతం రాజమౌళి అంటే ఇండస్ట్రీలో ఉన్న అందరు డైరెక్టర్లు సైతం ఆయనని ఆదర్శంగా తీసుకుంటారు. ఆయన తీసిన మొదటి సినిమా అయిన స్టూడెంట్ నెంబర్ వన్ సినిమా నుంచి ఆర్అర్ఆర్ వరకు వరుస విజయాలను సాధించి ఇండస్ట్రీ లో ఆయనకంటూ ఒక రాజముద్ర ని ఏర్పాటు చేసుకున్నాడు..
ఇక రాజమౌళి లాంటి డైరెక్టర్ తెలుగులో ఉండటం నిజంగా మన అదృష్టం అనే చెప్పాలి.ఎందుకంటే ఆయన చేసిన చాలా సినిమాల వల్ల తెలుగు సినిమా స్థాయి ఎక్కడికో వెళ్లిపోయింది. అయితే ఇవాళ్ళ రాజమౌళి పుట్టిన రోజు కావడం తో సోషల్ మీడియా మొత్తం రాజమౌళి గురించిన స్టోరీస్ తో మొత్తం రాజమౌళి పేరే వినిస్తుంది. ఇక దాంట్లో భాగంగానే ఆయన అస్తులకి సంభందించిన ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ కూడా ఇప్పుడు నెట్లో తెగ వైరల్ అవుతుంది.ఎంటి అంటే ప్రస్తుతం ఆయన దగ్గర 158 కోట్ల వరకు ఆస్తులు ఉన్నట్టు గా తెలుస్తుంది…
అందులో భాగంగానే ఆయనకి హైదరాబాద్‌లో విలాసవంతమైన ఇల్లు ఉంది దాంట్లోనే ప్రస్తుతం రాజమౌళి ఉంటున్నాడు.ఇక విదేశాల్లో కూడా కొన్ని ప్రాంతాల్లో ఆయన ఆస్తులు కొని పెట్టారు.. అలాగే రాజమౌళికి కార్ల విషయంలో పెద్దగా ఆసక్తి లేదు.కానీ వాళ్ల అబ్బాయి అయిన కార్తికేయ కి కార్లు అంటే పిచ్చి అందుకే వాళ్ల అబ్బాయి కి కొన్ని కార్లు కొని పెట్టారు కానీ రాజమౌళి దగ్గర మాత్రం ఒక రేంజ్ రోవర్, బీఎండబ్ల్యూ కార్లు మాత్రమే ఉన్నాయి.
అయితే రాజమౌళి రామ రాజమౌళి ని ప్రేమించి పెళ్లి చేసుకున్నాక ఆమె ఇష్టం మేరకు స్టార్టింగ్ లో ఒక మారుతి కార్ ని కూడా రాజమౌళి కొనుగోలు చేశారు. ఇప్పటికీ కూడా దాన్ని వాడకపోయిన రమా గుర్తుగా రాజమౌళి అలా ఉంచుకున్నారట…ఇక రాజమౌళి ఫ్యామిలీ విషయానికి వస్తె వీళ్ళ పూర్వీకులు మొత్తం కర్ణాటక ప్రాంతానికి చెందిన వారు కావడం విశేషం..అయితే వీళ్ళ కుటుంబం చాలా కాలం క్రితం ఆంధ్రప్రదేశ్ కి రావడం జరిగింది ముఖ్యం గా రాజమౌళి 1973 లో పుడితే వీళ్ళ ఫ్యామిలీ మాత్రం 1977 లో ఆంధ్రప్రదేశ్ లోని కొవ్వూరు ప్రాంతానికి వచ్చి స్థిర పడ్డారు…ఇక అప్పటి నుంచి వీళ్ళ నాన్న, పెద నాన్న సినిమాల్లో రైటర్లు గా ఉండటం తో రాజమౌళి, కీరవాణి లాంటి వాళ్ళు ఇండస్ట్రీ కి రావడం జరిగింది…